News October 24, 2024

రూ.50 వేల కోట్లతో పనులు: చంద్రబాబు

image

AP: రాబోయే రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 47 పనులు కొనసాగుతున్నాయి. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో కొన్నిటికి భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్యలు ఉన్నాయి. బెంగళూరు-కడప, విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు సంబంధించి పర్యావరణ అనుమతులు సాధించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 3, 2025

ఇవాళ అకౌంట్లోకి డబ్బులు: ప్రభుత్వం

image

TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ పూర్తి స్థాయిలో వేతనాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1వ తేదీన సాంకేతిక కారణాలతో జీతాలు జమ కాలేదని చెప్పింది. సమస్యలను పరిష్కరించి నిన్నటి నుంచి జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. పలువురి ఖాతాల్లో గురువారం రాత్రి జమ కాగా, మిగతా వారికి ఇవాళ డబ్బులు పడనున్నాయి. కాగా జనవరి 1న సెలవు కావడంతో జీతాలు జమ కాలేదనే ప్రచారం జరిగింది.

News January 3, 2025

చర్లపల్లి రైల్వే టెర్మినల్ 6న ప్రారంభం

image

TG: చర్లపల్లిలో రూ.430 కోట్లతో నిర్మించిన రైల్వే టెర్మినల్‌ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. గత నెల 28నే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ మాజీ పీఎం మన్మోహన్ మృతి కారణంగా వాయిదా పడింది. సికింద్రాబాద్ స్టేషన్‌పై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు.

News January 3, 2025

డబుల్ డెక్కర్‌గా విజయవాడ, వైజాగ్ మెట్రోలు

image

AP: విజయవాడ, వైజాగ్‌లో మెట్రో ప్రాజెక్టులకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను రూపొందించాలని సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించిన డిజైన్లను సీఎం చంద్రబాబు తాజాగా ఆమోదించారు. డబుల్ డెక్కర్ ప్లాన్‌లో పైన మెట్రో ట్రాక్, కింద వాహనాలకు ఫ్లై ఓవర్ ఉంటుంది. వైజాగ్‌లో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ, విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకూ డబుల్ డెక్కర్ ఉంటుంది.