News October 24, 2024

జగన్ నాకు షేర్లు బదిలీ చేయలేదు: షర్మిల

image

AP: జగన్ తనకు షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని షర్మిల మండిపడ్డారు. ‘ఆస్తులపై ప్రేమతో కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తెచ్చారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదు. వాటిని బదిలీ చేసుకోవచ్చు. షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దవుతుందని జగన్ వాదిస్తున్నారు. 2019లో వంద శాతం వాటాలు బదలాయిస్తానని ఎంవోయూపై సంతకం ఎలా చేశారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించారు.

Similar News

News October 24, 2024

జస్టిస్ సంజీవ్ ఖన్నా నేపథ్యం

image

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14, 1960లో జ‌న్మించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2005లో ఢిల్లీ HCలో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంత‌రం 2019లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా నియమితులయ్యారు. త‌దుప‌రి CJIగా ఆయ‌న 183 రోజుల‌పాటు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.

News October 24, 2024

శారదా పీఠానికి భూముల కేటాయింపు రద్దు

image

AP: తిరుమలలోని గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని టీటీడీకి దేవదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 26న శారదా పీఠానికి అప్పటి టీటీడీ బోర్డు గోగర్భం వద్ద భూమి కేటాయించింది. ఆ భూ కేటాయింపుపై నివేదిక ఇవ్వాలని టీటీడీని కోరింది.

News October 24, 2024

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం

image

దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు 51వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న నియామ‌కానికి రాష్ట్రప‌తి ద్రౌప‌దీ ముర్ము ఆమోదం తెలిపారు. న‌వంబ‌ర్ 11న జ‌స్టిస్ ఖ‌న్నా సీజేఐగా ప్ర‌మాణం చేస్తారు. జ‌స్టిస్ ఖ‌న్నా పేరును ప్ర‌స్తుత సీజేఐ డీవై చంద్ర‌చూడ్ ప్ర‌తిపాదించిన విష‌యం తెలిసిందే. నవంబర్ 10న జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు.