News October 24, 2024
YouTube వీడియోలు చూస్తూ జాబ్ కొట్టింది!

గిరిజన ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల బిని ముదులి యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సత్తాచాటారు. నెట్‌వర్క్ లేకపోవడంతో ఇతర ప్రాంతానికి వెళ్లి యూట్యూబ్ వీడియోలు, ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌ల ద్వారా ప్రిపేర్ అయి 596వ ర్యాంకు సాధించారు. దీంతో OCSలో ఉద్యోగం పొందిన తొలి బోండా జాతి యువతిగా ఆమె చరిత్ర సృష్టించారు. పేరెంట్స్ కోచింగ్ ఫీజు చెల్లించలేరని, సొంతంగా ప్రిపేర్ అయినట్లు ఆమె తెలిపారు.
Similar News
News February 8, 2026
అరటిలో బోరాన్ లోపం లక్షణాలు – నివారణ

అరటిలో బోరాన్ ధాతు లోపం వల్ల ఆకుల ఈనెలు ఉబ్బెత్తుగా, బిరుసుగా, పెళుసుగా మారతాయి. ఆకుల తొడిమలు కురచబారి, మొవ్వులో గుబురుగా ఏర్పడతాయి. చెట్టు ఎదుగుదల తగ్గి, గెలలు చిన్నవిగా ఉండి, మొవ్వు నుంచి పూర్తిగా బయటకు రాదు. కాయలపై నిలువు పగుళ్లు ఏర్పడతాయి. పండు పరిమాణం, నాణ్యత కోల్పోతుంది. దీని నివారణకు లీటరు నీటికి బోరాక్స్/ బోరిక్ ఆమ్లం 1గ్రా. కలిపి ఆకులపై 10 రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి.
News February 8, 2026
AERAలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(A<
News February 8, 2026
అన్నదానం ఎంత పుణ్యమో..

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఉడికించిన బియ్యమే కాదు, ప్రాణశక్తినిచ్చే ప్రతి ఆహారం అన్నమే. మన శరీరంలోని ‘అన్నమయ కోశం’ ఆహారం వలనే ప్రాణశక్తిని పొందుతుంది. అందుకే అన్నదానమంటే ప్రాణం దానం చేయడమే. అందుకే అన్నదానం చేయాలని శాస్త్రాలు చెబుతాయి. ఓ కోయవాడు బ్రాహ్మణుడికి ఓ రాత్రి అన్నం పెట్టిన పుణ్యంతోనే మరుజన్మలో రాకుమారుడిగా జన్మించాడు. అన్నదానానికి విచక్షణతో పనిలేదు. ఆకలితో ఉన్నవారికి పెట్టడమే పరమోత్కృష్టం.


