News October 24, 2024

రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. ఎప్పుడంటే?

image

TG: జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ధాన్యం సేకరిస్తోందని, ఈ సీజన్‌లో 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రతి ఏటా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Similar News

News January 3, 2025

మహా కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

image

ఉత్తర్ ప్రదేశ్‌లో జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు 26 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వచ్చే నెల 5 నుంచి 27 వరకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి యూపీ మధ్య నడవనున్నాయి. గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ నుంచి వెళ్లే రైళ్లు వరంగల్, రామగుండం మీదుగా వెళ్లనున్నాయి.

News January 3, 2025

రోహిత్ రెస్ట్ తీసుకుంటున్నారా? తప్పించారా?

image

BGT 5వ టెస్టులో రోహిత్‌కు బదులు బుమ్రా టాస్‌కు రావడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. నిన్న IND జట్టులో మార్పులుంటాయని, రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని ఊహాగానాలొచ్చిన విషయం తెలిసిందే. వాటిని నిజం చేస్తూ రోహిత్ జట్టులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బుమ్రా చెప్పినట్లు హిట్ మ్యాన్ తాను ‘ఆడను, రెస్ట్ తీసుకుంటా’ అని చెప్పారా? కావాలనే జట్టు నుంచి తప్పించారా? అనే అంశం చర్చనీయాంశమైంది.

News January 3, 2025

ఇవాళ అకౌంట్లోకి డబ్బులు: ప్రభుత్వం

image

TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ పూర్తి స్థాయిలో వేతనాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1వ తేదీన సాంకేతిక కారణాలతో జీతాలు జమ కాలేదని చెప్పింది. సమస్యలను పరిష్కరించి నిన్నటి నుంచి జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. పలువురి ఖాతాల్లో గురువారం రాత్రి జమ కాగా, మిగతా వారికి ఇవాళ డబ్బులు పడనున్నాయి. కాగా జనవరి 1న సెలవు కావడంతో జీతాలు జమ కాలేదనే ప్రచారం జరిగింది.