News October 24, 2024

2 రాష్ట్రాల్లో వారి కోసం కేజ్రీవాల్ ప్ర‌చారం

image

మ‌హారాష్ట్ర‌, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో INDIA కూట‌మి త‌ర‌ఫున ఢిల్లీ EX CM కేజ్రీవాల్ ప్ర‌చారం చేయ‌నున్న‌ట్టు సమాచారం. ఈ విష‌య‌మై శివ‌సేన UBT, NCP SP కేజ్రీవాల్‌ను సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. MHలో ఆప్ క్యాడ‌ర్ ఉన్న స్థానాల్లో వివాదాస్ప‌ద నేప‌థ్యం లేని అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఆయ‌న ప్ర‌చారం చేస్తార‌ని స‌మాచారం. హేమంత్ సోరెన్‌కు మద్దతుగా ఝార్ఖండ్‌లో ప్ర‌చారం చేస్తార‌ని ఆప్ వర్గాలు చెప్పాయి.

Similar News

News January 3, 2025

శ్రీవారికి గత ఏడాది రూ.1365 కోట్ల ఆదాయం

image

తిరుమలేశుడికి గత ఏడాది హుండీ ద్వారా సమకూరిన ఆదాయం వివరాలను టీటీడీ తాజాగా వెల్లడించింది. స్వామివారికి 2024లో రూ.1365 కోట్లు వచ్చాయని పేర్కొంది. మొత్తంగా 2.55 కోట్లమంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారని, వారిలో 99లక్షలమంది తలనీలాలు సమర్పించారని తెలిపింది. 12.44 కోట్ల లడ్డూల్ని విక్రయించామని స్పష్టం చేసింది.

News January 3, 2025

బంగ్లా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న శాంటో

image

బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ హొస్సేన్ శాంటో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నారు. బంగ్లా క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయన తమకు సమాచారాన్ని అందించారని, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని పేర్కొంది. టెస్టులు-వన్డేల్లో శాంటోనే కెప్టెన్‌గా కొనసాగుతారని వెల్లడించింది. దగ్గర్లో టీ20 సిరీస్ లేని నేపథ్యంలో కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై ఇంకా ఆలోచించడం లేదని స్పష్టం చేసింది.

News January 3, 2025

గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 54మంది మృతి

image

గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ మరోమారు వైమానిక దాడులతో విరుచుకుపడింది. పలు ప్రాంతాలపై చేసిన ఈ దాడుల్లో తమ పౌరులు కనీసం 54మంది మృతిచెందారని, అనేకమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని గాజా యంత్రాంగం ప్రకటించింది. అమాయకులైన పౌరులు తలదాచుకున్న శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడిందని మండిపడింది. కాగా.. మిలిటెంట్లే లక్ష్యంగా దాడులు నిర్వహించామని ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది.