News October 24, 2024
జస్టిస్ సంజీవ్ ఖన్నా నేపథ్యం

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14, 1960లో జన్మించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2005లో ఢిల్లీ HCలో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తదుపరి CJIగా ఆయన 183 రోజులపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
Similar News
News March 17, 2025
బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన పొన్నం

TG: బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లకు వేర్వేరుగా బిల్లులను తీసుకొచ్చింది. త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
News March 17, 2025
ఫేక్ పాస్‌పోర్టు, వీసాతో ప్రవేశిస్తే 7 ఏళ్లు జైలు, ఫైన్!

సరికొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారికి చుక్కలు కనిపించడం ఖాయమే. ఫేక్ పాస్‌పోర్టు లేదా వీసాతో దేశంలోకి ప్రవేశించేవారు, ఉండేవారు, విడిచివెళ్లే వారు గరిష్ఠంగా ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎయిర్‌లైన్స్, షిప్స్ ముందస్తుగా ప్రయాణికులు, స్టాఫ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
News March 17, 2025
చర్లపల్లి టర్మినల్‌కు పొట్టిశ్రీరాములు పేరు పెట్టండి: రేవంత్

TG: చర్లపల్లి టర్మినల్‌కు పొట్టిశ్రీరాములు పేరు పెట్టాలని CM రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డికి లేఖ రాస్తామని చెప్పారు. టర్మినల్‌కు ఆయన పేరు పెట్టి దేశభక్తి చాటుకోవాలని కోరారు. బల్కంపేటలోని ప్రకృతి వైద్య చికిత్స ఆలయానికి రోశయ్య పేరు పెడతామన్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.