News October 24, 2024

Meta, X స‌హ‌కారం కోరిన కేంద్ర ప్ర‌భుత్వం

image

విమానాలకు న‌కిలీ బాంబు బెదిరింపులు అధిక‌మ‌వ్వ‌డంతో వీటి క‌ట్ట‌డిలో స‌హ‌క‌రించాలని X, Meta సంస్థ‌ల‌ను కేంద్రం కోరింది. ఈ వేదిక‌ల మీద వ‌స్తున్న బెదిరింపు కాల్స్‌, సందేశాల వెనుక ఉన్న‌వారిని గుర్తించేందుకు అవ‌స‌ర‌మైన డేటాను త‌మ‌తో పంచుకోవాల‌ని కోరింది. దేశ ప్ర‌జ‌ల శ్రేయ‌స్సుతో ముడిప‌డిన అంశం కారణంగా 2 సంస్థ‌లు స‌హ‌క‌రించాల్సి ఉంద‌ని ఓ అధికారి తెలిపారు. 9 రోజుల్లో 170 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.

Similar News

News October 25, 2024

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దీనికి మంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉండనుండగా ప్రత్యేక ఆహ్వానితుడిగా కే.కేశవరావుని నియమించారు. శాఖల వారీగా ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్లో సబ్ కమిటీ భేటీ కానుంది. కాగా ఇవాళ సాయంత్రంలోపు పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ హామీనిచ్చారు.

News October 25, 2024

ఇక బ్లింకిట్‌లోనూ EMI సౌకర్యం

image

వినియోగదారుల కోసం వాయిదాల సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు డెలివరీ పోర్టల్ బ్లింకిట్ ప్రకటించింది. రూ.2999, అంతకంటే విలువైన ఆర్డర్లపై ఇది వర్తిస్తుందని తెలిపింది. కస్టమర్స్‌ ఫైనాన్షియల్ ప్లానింగ్‌ చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు అల్బీందర్ ధిండ్సా ట్విటర్‌లో వివరించారు. చెక్‌ ఔట్ సమయంలో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. వినియోగదారుడి బ్యాంకును బట్టి వడ్డీ రేటు ఉంటుంది.

News October 25, 2024

అందుకు జగన్ అరాచక పాలనే కారణం: మంత్రి

image

AP: కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మాలని జగన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ‘YCP హయాంలో మహిళలపై దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోలేదు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో అత్యాచారం జరిగితే నిందితుడ్ని అరెస్ట్ చేయలేదు. గత ఐదేళ్లలో యువతను గంజాయికి, డ్రగ్స్‌కి బానిసలు చేశారు. ఆ ప్రభావంతోనే సైకోలుగా మారిన కొందరు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు’ అని దుయ్యబట్టారు.