News October 25, 2024

ప.గో: జిల్లా TODAY TOP NEWS

image

* ఏలూరు: పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీలు
* సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ జైసూర్య
* నేను ఎప్పుడూ ప్రజల సేవకుడినే: మంత్రి దుర్గేశ్
* భీమవరంలో సైబర్ వలలో వైద్యుడు
* కామవరపుకోటలో నలుగురు అరెస్ట్
* పెదవేగిలో చిరుత సంచారంపై సీఐ వివరణ
* ఏలూరు: పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
* హెల్మెట్ ధరించి ప్రయాణించాలి: MLA రోషన్
* భీమవరంలో టాలీవుడ్ హీరో సందడి

Similar News

News November 27, 2024

ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం: జేసీ

image

తుఫాను భయంతో ముందస్తు కోతలు, నూర్పిడి చేయొద్దని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి రైతులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. జిల్లా బుధవారం జిల్లాలోని మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. తుఫాను హెచ్చరికల విషయమై రైతులెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. రైతులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.

News November 27, 2024

ఓం బిర్లాను కలిసిన RRR

image

దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణమ రాజు(RRR) మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ విషయాలు పంచుకున్నారు. RRR వెంట ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నారు. 

News November 27, 2024

నన్ను కొట్టిన వాళ్లంతా జైలుకు వెళ్తారు: RRR

image

ఉండి MLA, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు(RRR) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత ప్రభుత్వంలో నాపై కేసు పెట్టారు. విచారణలో భాగంగా కొందరు అధికారులు నన్ను కొట్టారు. ఇప్పుడు వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం. సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్ అరెస్ట్‌ను స్వాగతిస్తున్నా. ఈ కేసులో కీలకంగా ఉన్న సీఐడీ మాజీ చీఫ్ సునీల్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలి’ అని RRR కోరారు.