News October 25, 2024
ఆదిలాబాద్: కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఈనెల 28న బీసీ కమిషన్ బృందం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాజర్షి షా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ శ్యామల దేవితో కలిసి పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్డీవో వినోద్ కుమార్, డిబిసిడిఓ రాజలింగు, డిహెంహెచ్ఓ కృష్ణా, జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డిఎల్పీఓ, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Similar News
News March 11, 2025
ADB: కనిపించకుండా పోయి.. శవమై తేలాడు

మావలలో ఓ వ్యక్తి <<15710393>>మృతదేహం<<>> లభ్యమైన విషయం తెలిసిందే. అయితే మావల ఎస్ఐ గౌతమ్ వివరాల మేరకు.. మావలకు చెందిన షేక్ పర్వేజ్ (22) పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం సమయంలో ఇంటి నుంచి బయలుదేరి.. రాత్రయినా తిరిగి వెళ్లలేదు. సోమవారం ఉదయం మావల ఎర్రకుంట చెరువులో శవమై కనిపించాడు. కాగా తల్లి ఫిర్యాదు మేరకు సూసైడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News March 11, 2025
ADB: LRSపై అధికారుతో కలెక్టర్ సమావేశం

ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో LRS క్రమబద్ధీకరణ రుసుంపై మున్సిపల్, గ్రామపంచాయితీ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. LRS అవుట్ క్రమబద్ధీకరణపై ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మార్చ్31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లించే వారికి 25 శాతం రిబేట్ వర్తిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 11, 2025
బడిలో బాలిక మృతి.. ITDA PO వివరణ ఇదే

ఇచ్చోడ బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలిక మృతపై ITDA PO కుష్బూ గుప్తా వివరణ ఇచ్చారు. బాలికకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. ఇటీవల వైద్య శిబిరంలోనూ ఆమెకు పరీక్షలు చేయగా ఎలాంటి సమస్యలు ఉన్నట్లు తేలలేదన్నారు. డాక్టర్ల ప్రాథమిక అభిప్రాయం ప్రకారం విద్యార్థిని శ్వాసకోస సంబంధిత సమస్యతో మృతి చెంది ఉండవచ్చని పేర్కొన్నారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు.