News October 25, 2024

CID.. మళ్లీ వస్తోంది!

image

టీవీ ప్రేక్షకుల్ని అలరించిన CID సీరియల్ కొత్త సీజన్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఏసీపీ ప్రద్యుమన్, ఇన్‌స్పెక్టర్లు దయ, అభిజిత్ పాత్రలు తిరిగి ఆడియన్స్ ముందుకు రానున్నట్లు పింక్‌విల్లా తెలిపింది. సిరీస్‌ను కొనసాగించాలని వస్తున్న డిమాండ్ల మేరకు వచ్చే నెలలో షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆరేళ్ల క్రితం CID చివరి ఎపిసోడ్ ప్రసారమైంది.

Similar News

News October 25, 2024

26 నుంచి సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం

image

TG: నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నెల 26 నుంచి నాగర్ కర్నూలు(D) సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తేనుంది. కొల్హాపూర్(M) సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఏర్పాటు చేశారు. నల్లమల అందాలను తిలకిస్తూ ఏడు గంటల పాటు ప్రయాణం ఉంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు.

News October 25, 2024

ఎన్టీపీసీ లాభాల్లో జోష్

image

ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ APR-SEP త్రైమాసికంలో రూ.5,380.25 కోట్ల లాభాలను ఆర్జించింది. 2023-24లో ఇది రూ.4,726 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయంలో గతేడాదితో పోలిస్తే తగ్గుదల నమోదైంది. రూ.45,384.64 కోట్ల నుంచి రూ.45,197.77 కోట్లకు తగ్గింది. స్థూల విద్యుదుత్పత్తి 90.30 బిలియన్ యూనిట్ల నుంచి 88.46 బి.యూనిట్లకు తగ్గగా, క్యాప్టివ్ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 5.09 MMT నుంచి 9.03 ఎంఎంటీకి పెరిగింది.

News October 25, 2024

ఆ కమిటీల్లో ముగ్గురు తెలంగాణ ఎంపీలకు చోటు

image

TG: కేంద్ర టెక్స్‌టైల్, స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది. 14 మంది సభ్యులతో ఏర్పాటైన టెక్స్‌టైల్ శాఖ సంప్రదింపుల కమిటీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు చెందిన కమిటీలో ఎంపీలు మల్లు రవి, కడియం కావ్యలకు అవకాశం దక్కింది. ఈ కమిటీ 16 మందితో ఏర్పాటైంది.