News October 25, 2024

అక్టోబర్ 25: చరిత్రలో ఈరోజు

image

1921: సంగీత దర్శకుడు టి.వి.రాజు జననం
1962: గేయ రచయిత కలేకూరు ప్రసాద్ జననం
1987: భారత క్రికెటర్ ఉమేశ్ యాదవ్ జననం
1999: సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు మరణం
1951: దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం
అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం

Similar News

News November 3, 2025

కార్తీక పౌర్ణమి.. 10 లక్షల దీపాలతో ఏర్పాట్లు

image

UPలోని కాశీ మరో అద్భుత ఘట్టానికి వేదిక కానుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 5న అక్కడ దేవ్ దీపావళిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గంగా నది ఘాట్‌లతోపాటు నదీ తీరంలోని 20 ప్రాంతాల్లో దాదాపు 10 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనుంది. అలాగే కాశీ గొప్పతనాన్ని చాటేలా 500 డ్రోన్లతో ప్రదర్శన, లేజర్ షో, 3D ప్రజెంటేషన్ ఉండనుంది.

News November 3, 2025

SLBC టన్నెల్.. రేపటి నుంచి సర్వే

image

TG: SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రిపేర్ అవుతోంది. రేపు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ప్రారంభించనున్నారు. సొరంగాల నిపుణుల సహాయంతో ఈ సర్వే చేపట్టనున్నారు. గతేడాది టన్నెల్ కూలి 8 మంది కార్మికులు మరణించడంతో అలాంటి లూస్ సాయిల్ ఎక్కడ ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సొరంగం మొత్తం పొడవు 43.9 కి.మీ కాగా ఇంకా 9.5 కి.మీ తవ్వాల్సి ఉంది.

News November 2, 2025

బిగ్‌బాస్: దువ్వాడ మాధురి ఎలిమినేట్

image

బిగ్‌బాస్ సీజన్ 9 నుంచి ఈ వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యారు. నామినేషన్స్ ప్రక్రియలో మాధురి, సంజన, రీతూ చౌదరి, కళ్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్‌లు ఉన్నారు. ఆడియన్స్ నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన మాధురి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. కాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.