News October 25, 2024

పుస్తకాల బరువుతో పిల్లల్లో ఆ సమస్యలు!

image

పుస్తకాల బ్యాగుల రూపంలో పిల్లల నడుముపై భారాన్ని వేయడం దీర్ఘకాలంలో ప్రమాదకరమని ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యుడు సమీర్ రూపారెల్ పేర్కొన్నారు. ‘బ్యాగుల బరువు వల్ల ప్రతి 10మందిలో 8మంది చిన్నారులకి వెన్ను సమస్యలు వస్తున్నాయి. బ్యాగుల బరువు వారి శరీర బరువులో 15శాతాన్ని మించకూడదు. అధిక బరువు వల్ల మెడ, భుజాల నొప్పులు, వెన్ను వంగిపోయే స్కోలియోసిస్ వంటి పరిస్థితులూ తలెత్తవచ్చు’ అని హెచ్చరించారు.

Similar News

News July 6, 2025

‘అన్నదాత సుఖీభవ’ అనర్హులకు అలర్ట్

image

AP: ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అర్హత సాధించని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మొదటి దశ పరిశీలన, రెండోదశ ధ్రువీకరణలో అర్హత సాధించలేకపోయిన రైతుల రికార్డులను కంప్లైంట్ మాడ్యూల్‌లో పొందుపరిచారు. అనర్హులుగా ఉన్న రైతులు ఫిర్యాదు చేసేందుకు ముందు రైతు సేవాకేంద్రంలోని సిబ్బందిని కలవాలని అధికారులు తెలిపారు. ఈనెల 10లోపు ఫిర్యాదుల స్వీకరణ ముగించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ సూచించారు.

News July 6, 2025

బిర్యానీ అంటే.. అదో ఎమోషన్!

image

‘వరల్డ్ బిర్యానీ డే’ ఒకటుందని తెలుసా? జులైలో తొలి ఆదివారాన్ని బిర్యానీ డేగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమందికి బిర్యానీ అనేది ఒక ఎమోషన్. ఇది పర్షియా నుంచి ఉద్భవించిందని, మొఘలులు భారత్‌కు తెచ్చారని నమ్ముతారు. ఇందులో హైదరాబాదీ బిర్యానీ, లక్నో, కోల్‌కతా అంటూ చాలానే రకాలున్నాయి. వీటికి అదనంగా ఫ్రై పీస్, ఉలవచారు అంటూ మనోళ్లు చాలానే కనిపెట్టారు. మరి.. మీకే బిర్యానీ ఇష్టం? COMMENT చేయండి.

News July 6, 2025

31 నుంచి సికింద్రాబాద్‌లో అగ్నివీర్ ర్యాలీ

image

TG: ఈనెల 31 నుంచి సికింద్రాబాద్‌ AOC సెంటర్‌లోని జోగిందర్ స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. జనరల్ డ్యూటీ(జీడీ), టెక్నికల్, క్లర్క్, ట్రేడ్స్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈవెంట్లు SEP 14 వరకు కొనసాగుతాయి. అటు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ ట్రయల్స్ కూడా నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు AOC సెంటర్ హెడ్‌క్వార్టర్‌ను లేదా <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించాలి.