News October 25, 2024

ఎన్నికలకు కమిటీలను ప్రకటించిన బీజేపీ

image

TG: ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆందోళన కార్యక్రమాలపై బీజేపీ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ఎంపీ అరవింద్, పాల్వాయి హరీశ్, ఏవీఎన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, జి.నగేశ్, ఈటెల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రాకేశ్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ తదితరులకు చోటు లభించింది. రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని పార్టీ ప్రకటించనుంది.

Similar News

News October 25, 2024

నేటి నుంచి పశుగణన

image

AP: నేటి నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు 21వ అఖిల భారత పశు గణన చేపట్టనున్నట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 21,173 గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో పశువుల వివరాలను నమోదు చేయనున్నట్లు పేర్కొంది. గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, వివిధ రకాల కోళ్లు, పక్షులతో సహా 16రకాల పెంపుడు జంతువులపై జాతుల వారీగా సమాచారాన్ని సేకరించనుంది. పశు గణనను ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు.

News October 25, 2024

వరంగల్ ఎయిర్‌పోర్టుకు లైన్ క్లియర్?

image

TG: WGL(D) మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 150K.M పరిధిలో 2038 వరకూ వాణిజ్య ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయవద్దనే రూల్‌ను పక్కన పెట్టేందుకు GMR సంస్థ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో పనులు పట్టాలెక్కనుండగా, మొత్తం 950 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. 696 ఎకరాల భూమి AAI పరిధిలో అందుబాటులో ఉండగా, 253 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.

News October 25, 2024

US ELECTIONS: మళ్లీ ఫామ్‌లోకి డొనాల్డ్ ట్రంప్!

image

అమెరికా అధ్యక్ష రేసులో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పుంజుకున్నారు. డెమోక్రాట్ అభ్యర్థి కమలా హ్యారిస్‌పై 2.5 పర్సంటేజీ పాయింట్ల తేడాతో ముందుకెళ్లారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ సర్వేలో 2 వారాలు వీరిద్దరూ నెక్ టు నెక్ పోటీపడ్డారని పొలిటికో సంస్థ తెలిపింది. కమల రేటింగ్ 49% నుంచి 45కు తగ్గగా ట్రంప్ 45 నుంచి 48కి పెరిగారు. ఇలాంటి సిచ్యువేషన్లో విజేత ఎంపికలో స్వింగ్ స్టేట్స్ అత్యంత కీలకమవుతాయని పొలిటికో పేర్కొంది.