News October 25, 2024

ఆ కమిటీల్లో ముగ్గురు తెలంగాణ ఎంపీలకు చోటు

image

TG: కేంద్ర టెక్స్‌టైల్, స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలకు చోటు దక్కింది. 14 మంది సభ్యులతో ఏర్పాటైన టెక్స్‌టైల్ శాఖ సంప్రదింపుల కమిటీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు చెందిన కమిటీలో ఎంపీలు మల్లు రవి, కడియం కావ్యలకు అవకాశం దక్కింది. ఈ కమిటీ 16 మందితో ఏర్పాటైంది.

Similar News

News October 25, 2024

యాదృచ్ఛికం: టెస్టు రికార్డుల్లో కామన్‌గా 7/59

image

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ 7/59తో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే నాలుగు దశాబ్దాల్లో మొత్తం నలుగురు ప్లేయర్లే ఈ ఘనత సాధించారు. 1994లో అనిల్ కుంబ్లే, 2005లో ఇర్ఫాన్ పఠాన్, 2016లో అశ్విన్, 2024లో సుందర్ 7 వికెట్లు తీశారు. ఇందులో ప్రతిఒక్కరూ 7 వికెట్లు తీసి 59 పరుగులు సమర్పించారు. భారత్ అత్యధిక టెస్టు స్కోరు కూడా 759 పరుగులే.

News October 25, 2024

DANGER: సమోసా, చిప్స్, ఫాస్ట్‌ఫుడ్స్‌తో డయాబెటిస్

image

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మధుమేహానికి దారి తీస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తేల్చింది. సమోసా, పకోడి, ఫ్రైడ్ చికెన్, చిప్స్, కేక్స్, ఫాస్ట్ ఫుడ్స్ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతున్నట్లు నిర్ధారించింది. ఇవి శరీరంలో హానికరమైన అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్‌గా మారి ఇన్సులిన్ నిరోధకతను దెబ్బతీస్తున్నాయి. దీంతో టైప్-2 మధుమేహం, ఊబకాయానికి దారితీస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

News October 25, 2024

డేవిడ్ వార్నర్‌‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత

image

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై విధించిన జీవితకాల కెప్టెన్సీ నిషేధం తొలిగిపోయింది. 2018లో శాండ్ పేపర్ వివాదంలో అతడిని కెప్టెన్సీ నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు బ్యాన్ చేసింది. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్‌ BBLలో సిడ్నీ థండర్‌కు కెప్టెన్‌గా ఉండే అవకాశం లభించింది.