News October 25, 2024
రామభద్రపురం: హార్ట్ఎటాక్‌తో ఉపాద్యాయుడు మృతి

రావివలస ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు పిసిని.వెంకటప్పడు (57) హార్ట్ ఎటాక్‌తో పాఠశాల పరిసర ప్రాంతంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన వాడని, విధుల నిమిత్తం ఇక్కడ పనిచేస్తున్నారన్నారు. గురువారం విధుల్లో ఉంటూ బయటకు వచ్చారని అక్కడే తీవ్ర గుండె నొప్పితో కుప్పకూలి మృతి చెందారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు.
Similar News
News December 31, 2025
VZM: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

విశాఖలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన విజయనగరం జిల్లా వ్యక్తికి స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భోగాపురం ప్రాంతానికి చెందిన నర్సింగ్ విశాఖ వన్‌టౌన్ పరిధిలో ఉంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో అదే ప్రాంతంలో ఉంటున్న 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో కోర్టు పైవిధంగా శిక్షను విధిస్తూ మంగళవారం తీర్పు నిచ్చింది.
News December 31, 2025
VZM: పెన్షన్‌దారులకు అలెర్ట్

రాష్ట్ర ప్రభుత్వ, కుటుంబ పెన్షన్‌దారులు 2026 సంవత్సరానికి లైఫ్ సర్టిఫికేట్‌ను జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోపు తప్పనిసరిగా సమర్పించాలని విజయనగరం జిల్లా ఖజానా అధికారి నాగమహేశ్ మంగళవారం తెలిపారు. జిల్లా ట్రజరీ, సబ్ ట్రజరీ కార్యాలయాల్లో జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు ఏర్పాట్లు చేశామన్నారు. 2025 నవంబర్, డిసెంబర్‌లో సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్లు చెల్లవన్నారు.
News December 30, 2025
VZM: ‘తక్కువ వడ్డితో ఈ సొసైటితో రుణాలు పొందండి’

పోలీసు సిబ్బంది ఆర్థిక అవసరాలు తీర్చేందుకే కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు SP ఏఆర్ దామోదర్ తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్నారు. తక్కువ వడ్డీతో ఈ సొసైటీ ద్వారా రుణాలు పొందే పోలీసు ఉద్యోగులు తమ కుటుంబ అవసరాలు తీర్చుకోగలుగుతున్నారన్నారు. త్వరలో జిల్లా కో-ఆపరేటివ్ సొసైటీకి నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు.


