News October 25, 2024
కరీంనగర్: మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్టపడేనా!

ప్రతి సంవత్సరం రైస్ మిల్లర్ల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి సంచి బరువుతో సహా 40.650 కిలోల ధాన్యం తూకం వేయాల్సి ఉండగా.. తాలు పేరుతో గతంలో ధాన్యం కొనుగోళ్లలో కొన్ని చోట్ల ఆఖరి దశలో 42కిలోల వరకు కాంటా పెట్టారు. దీంతో రైస్ మిల్లర్ల దోపిడీని నియంత్రించి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News July 9, 2025
కరీంనగర్: ‘తక్షణమే హార్డ్ కాపీలు పంపాలి’

కరీంనంగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల e-pass లాగిన్లలో పెండింగ్‌లో ఉన్న యుటిలైజేషన్ సర్టిఫికెట్లు తాజా, పునరుద్ధరణ ఉపకారవేతన దరఖాస్తులను (Fresh/Renewal Scholarship Applications) తక్షణమే వెరిఫై చేయాలని DTDO సంగీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటి హార్డ్ కాపీలను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయానికి తక్షణమే సమర్పించలన్నారు. సందేహాల నివృత్తికి 9502664044కు కాల్ చేయాలని కోరారు.
News July 9, 2025
KNR: భార్య దూషించందని భర్త సూసైడ్

కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తిచెంది పురుగుమందు తాగి వ్యక్తి మృతిచెందిన ఘటన వీణవంక మండలం కోర్కల్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. నిమ్మల రాజు భార్య రజితతో కొంతకాలంగా అలుగునూరులో కూలీపని చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా రజిత రాజును తీవ్రంగా దూషించింది. మనస్తాపం చెందిన భర్త పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు SI తిరుపతి తెలిపారు.
News July 9, 2025
నిరుద్యోగ యువతీయువకులకు సువర్ణవకాశం

శంకరపట్నం మండలం ఎంపీడీవో కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ పేద నిరుద్యోగ యువతీయువకులకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో శిక్షణ అందించి ఉద్యోగం కల్పించనున్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్‌తో ఈ నెల 10న కార్యాలయంలో సంప్రదించాలని ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తెలియజేశారు.