News October 25, 2024

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 1000కి.మీ పాదయాత్ర

image

TG: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఆధ్వర్యంలో మహా పాదయాత్రకు దళితులు సిద్ధం అవుతున్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు సాగే పాదయాత్రను మాజీ ఎంపీ హర్షకుమార్ ఇవాళ ప్రారంభిస్తారు. 38 రోజుల పాటు 16 జిల్లాలు, 35 నియోజకవర్గాల మీదుగా 1000కి.మీ మేర ఈ పాదయాత్ర సాగనుంది. డిసెంబర్ 1న ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Similar News

News October 25, 2024

ఢిల్లీ వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన.. మార్నింగ్ వాక్‌కు గుడ్‌బై!

image

ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా తాను మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేసినట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. గాలి నాణ్యత క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ సూచన మేరకు మార్నింగ్ వాక్‌కు వెళ్లట్లేదని, దీని వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 283గా నమోదైంది. కాలుష్యం పెరగడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు.

News October 25, 2024

బెడిసికొట్టిన ప్లాన్.. భారత్ ఆలౌట్

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ వేసిన ‘స్పిన్’ ప్లాన్ బెడిసికొడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కివీస్ స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్నారు. శాంట్నర్(7), ఫిలిప్స్(2) ధాటికి కుదేలైన భారత్ 156 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 103 పరుగులు వెనుకబడి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్పిన్ పిచ్‌లో భారత్ తరఫున సుందర్(7), అశ్విన్(3) వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

News October 25, 2024

సీఎం రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా: కిషన్ రెడ్డి

image

TG: మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉండాలని సీఎం రేవంత్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. HYD ధర్నా చౌక్ వద్ద BJP చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ‘పేదల కోసం మూసీ పరీవాహకంలో ఉండటానికైనా మేము సిద్ధం. ఇళ్లను కూల్చాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. ఇక్కడ ఉండలేకపోతున్నామని పేదలు ఎవరైనా చెప్పారా? వారి బాధలు సీఎంకు తెలుసా?’ అని వ్యాఖ్యానించారు.