News October 25, 2024
MNCL: రేపటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ

మత్స్యకారులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నుంచి మంచిర్యాల జిల్లాలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది జిల్లాలోని జలాశయాలు, చెరువులు, కుంటలలో 2.18 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఎల్లంపల్లి ప్రాజెక్టు, సుందిళ్ల బ్యారేజీలో రొయ్య పిల్లలు పంపిణీ చేస్తారు.
Similar News
News March 8, 2026
ADB: ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు

ITI సంబంధిత ఏదైనా ట్రేడుల్లో అనుభవం ఉండి సర్టిఫికేట్ లేని ప్రైవేట్ అభ్యర్థుల నుంచి ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ITI కోర్సులకు సంబంధించిన ట్రేడుల్లో కనీసం 3 సం.ల పని అనుభవం కలిగి, 21 వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 15 లోపు వరంగల్‌లోని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 8, 2026
ADB: బాధితుల ఇండ్ల వద్ద ఎఫ్ఐఆర్ నమోదు

ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో బాధితుల ఇండ్ల వద్దకే శనివారం పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. డివిజన్ పరిధిలో 6 కేసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సులభంగా వేగంగా సేవలు అందించాలని లక్ష్యంతో బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని పోలీస్ శాఖ అమలులోకి తీసుకువచ్చిందని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇది బాధితులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.