News October 25, 2024
గద్వాల: అవమానంతో బాలిక సూసైడ్ !

అవమానం భరించలేక బాలిక సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. మల్దకల్‌కు చెందిన బాలిక(17) గద్వాలకు చెందిన రాజశేఖర్ రెడ్డి ఇంట్లో పనిలో చేరింది. కాగా ఇంట్లో దొంగతనం చేసిందని యజమాని ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలిక, ఆమె తల్లిని PSకు పిలిచి విచారించినట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో అవమనంగా భావించిన బాలిక పురుగుమందు తాగింది. కర్నూల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
Similar News
News November 18, 2025
బాలానగర్: ఫోన్‌పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్‌పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.

News November 17, 2025
బాలానగర్‌లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్‌లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.