News October 25, 2024

ఇండియాలో ఏ భాష వినియోగం ఎక్కువ?

image

దేశంలోని చాలా రాష్ట్రాల్లో హిందీ భాష వినియోగంలో ఉంది. ఓ నివేదిక ప్రకారం దాదాపు 52.82 కోట్ల మంది హిందీ మాట్లాడతారు. బెంగాలీని 9.72కోట్ల మంది మాట్లాడితే 8.30 కోట్ల మంది మరాఠీలో సంభాషిస్తారు. ఇక 8.11 కోట్ల మంది తెలుగు, 6.90 కోట్ల మంది తమిళం మాట్లాడుతున్నారు. 5.54 కోట్ల మంది గుజరాతీ, 5.07 కోట్ల మంది ఉర్దూ, కన్నడ భాషను 4.37 కోట్లు, 3.75 కోట్ల మంది ఒడియా, మలయాళం మాట్లాడేవారు 3.48 కోట్ల మంది ఉన్నారు.

Similar News

News October 25, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ‘స్వాగ్’

image

శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్వాగ్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

News October 25, 2024

ఢిల్లీ వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన.. మార్నింగ్ వాక్‌కు గుడ్‌బై!

image

ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా తాను మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేసినట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. గాలి నాణ్యత క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ సూచన మేరకు మార్నింగ్ వాక్‌కు వెళ్లట్లేదని, దీని వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 283గా నమోదైంది. కాలుష్యం పెరగడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు.

News October 25, 2024

బెడిసికొట్టిన ప్లాన్.. భారత్ ఆలౌట్

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ వేసిన ‘స్పిన్’ ప్లాన్ బెడిసికొడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కివీస్ స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్నారు. శాంట్నర్(7), ఫిలిప్స్(2) ధాటికి కుదేలైన భారత్ 156 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 103 పరుగులు వెనుకబడి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్పిన్ పిచ్‌లో భారత్ తరఫున సుందర్(7), అశ్విన్(3) వికెట్లు తీసిన విషయం తెలిసిందే.