News October 25, 2024
గుడిహత్నూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఉదయాన్నే రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం డోంగర్ గావ్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని కమాండర్ వాహనం ఢీకొంది. ఈఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం బోల్తా పడగా అందులోని ఆరుగురికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 17, 2025
ఆదిలాబాద్: పోలీస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం

ఆదిలాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు.
News September 17, 2025
ఆదిలాబాద్: రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది: ఎస్పీ

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నియంత పాలన అంతమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృతనిశ్చయంతో విధులు నిర్వహించాలన్నారు.
News September 17, 2025
ADB: డిగ్రీలో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శివకృష్ణ తెలిపారు. ఈనెల 18, 19న అడ్మిషన్లు ఉంటాయని తెలిపారు. బీఏలో 1, బీకాం (సీఏ)లో 3, బీఎస్సీ బీజేడ్సీలో 3, ఎంపీసీఎస్‌లో 14 , డాటా సైన్స్‌లో 22 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు 9849390495 నంబర్‌కు సంప్రదించాలన్నారు.