News October 25, 2024

విద్యార్థులు చేసిన బ్రీమాటో ప్రాజెక్ట్ పరిశోధనలు విజయవంతం

image

గోరంట్ల మండలంలోని బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నట్లు అగ్రికల్చర్ వింగ్ కో ఆర్డినేటర్ రామ్ గోపాల్ మోపూరి తెలిపారు. టమాటా మొక్కకు టమాటాతో పాటు వంకాయలు కాసే విధంగా డ్రాపింగ్ చేసి ఒకే చెట్టుకు రెండు రకాల కాయలు కాసే విధంగా చేశారన్నారు. విద్యార్థుల ప్రతిభను పలువరు ప్రశంసించారు.

Similar News

News September 18, 2025

గుంతకల్లుకు నటి నిధి అగర్వాల్

image

ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఈ నెల 22న గుంతకల్లుకు రానున్నారు. ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి ఆమె రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’లో నటించిన ఆమె ప్రస్తుతం ‘ది రాజాసాబ్‌’ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు.

News September 18, 2025

ఈ బస్సులో స్త్రీ శక్తి పథకం వర్తించదు.. ఎక్కడో తెలుసా..!

image

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కానీ అనంతపురం జిల్లాలో తాడిపత్రి నుంచి పుట్లూరు మీదుగా గరుగుచింతలపల్లికి వెళ్లే రూట్‌లో మాత్రం ఉచిత ప్రయాణం అమలు కావటం లేదు. ‘మా గ్రామాలకు ఒక్క బస్సు మాత్రమే ఉంది. దిక్కు లేక టికెట్ కొనుక్కుని వెళ్తున్నాం’ అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News September 18, 2025

అనంత జిల్లాకు 1482.30 మెట్రిక్ టన్నుల యూరియా

image

అనంతపురం జిల్లాకు RCF సంస్థ నుంచి 1482.30 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుందని DA అల్తాఫ్ అలీ ఖాన్ తెలిపారు. ప్రసన్నాయిపల్లి రేట్ పాయింట్ వద్ద ఆయన యూరియాను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్‌కు 899.01 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 583.29 మెట్రిక్ టన్నులు కేటాయించామని వెల్లడించారు.