News October 25, 2024
అయ్యో.. సంజూశాంసన్! నీకే ఎందుకిలా!!

బంగ్లాపై టీ20 సెంచరీతో దుమ్మురేపిన సంజూశాంసన్ ఆస్పత్రిలో చేరుతున్నారు. కింది పెదవిలో మ్యూకస్ సిస్ట్‌ను తొలగించుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. NOV 8 నుంచి సౌతాఫ్రికాతో 4 టీ20ల సిరీస్ మొదలవుతుంది. అక్కడి టఫ్ బౌన్సీ, పేస్ పిచ్‌లపై సంజూ కీలకం అవుతారు. ఈ సిరీస్ కోసం ముందుగానే చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడిప్పుడే టీమ్‌లో స్థిరపడుతున్న సంజూకే ఎందుకిలా అంటూ వాపోతున్నారు.
Similar News
News January 27, 2026
రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9లక్షల పరిహారం

UPలోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే విద్యార్థిని 7ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత రైల్వేపై కేసు గెలిచింది. 2018లో రైలు ఆలస్యం వల్ల ఆమె Bsc ప్రవేశ పరీక్ష రాయలేకపోయింది. దీంతో పరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. రైలు ఆలస్యమవడంపై అధికారుల నుంచి సరైన వివరణ రాకపోవడంతో ఆమెకు 45 రోజుల్లో రూ.9.10L చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చెల్లింపు ఆలస్యమైతే 12% వడ్డీ చెల్లించాలని పేర్కొంది.
News January 27, 2026
జనవరి 27: చరిత్రలో ఈరోజు

1922: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ జననం
1927: తెలుగు కవి, రచయిత పోతుకూచి సాంబశివరావు జననం
1936: కథా, నవలా రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి జననం
2009: భారత మాజీ రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ మరణం
2023: సినీ నటి జమున మరణం (ఫొటోలో)
* కుటుంబ అక్షరాస్యత దినోత్సవం
News January 27, 2026
పొలిటికల్ వెపన్‌లా సిట్ నోటీసులు: హరీశ్ రావు

TG: రేవంత్ ప్రభుత్వం సిట్ నోటీసుల్ని పొలిటికల్ వెపన్‌లా వాడుతోందని హరీశ్ రావు అన్నారు. కోల్ స్కామ్‌పై ప్రశ్నించడంతో పబ్లిక్ అటెన్షన్‌ను డైవర్ట్ చేసేందుకు తనకు, KTRకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని BRS నిర్ణయించిన కొన్ని గంటల్లోనే మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు వచ్చాయన్నారు. కాగా మంగళవారం గవర్నర్‌ను కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు ఇవ్వనున్నట్లు BRS తెలిపింది.


