News October 25, 2024
‘పొట్టేల్’ సినిమా రివ్యూ

1980 కాలంలో అసమానతలు, మూఢ నమ్మకాలు, చదువుకు నోచుకోని పిల్లల చుట్టూ తిరిగే ఓ గ్రామీణ కథ ‘పొట్టేల్’. స్టోరీ లైన్ బాగున్నప్పటికీ దానిని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు తడబడ్డాడు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. పటేల్ పాత్రలో అజయ్ ఆకట్టుకున్నారు. అనన్య నాగళ్ల సహా మిగతా వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. ల్యాగ్ సీన్లు మైనస్. ఎడిటింగ్, స్క్రీన్ ప్లేపై మరింత దృష్టి పెట్టాల్సింది. రేటింగ్: 2.5/5
Similar News
News January 19, 2026
మాఘమాసం ప్రారంభం.. ఇవి అలవరుచుకోండి!

మాఘమాసం అంటే పాపాలను హరించేది అని అర్థం. ఆధ్యాత్మిక చింతనకు ఇది ఎంతో శ్రేష్ఠమైన కాలమని పండితులు అంటున్నారు. ‘విష్ణువు, సూర్య భగవానుడు, శివుడికి ఈ నెల ఎంతో ముఖ్యమైనది. ఈ మాసంలో నదీ స్నానం చేస్తే పాపాలు హరిస్తాయి. పురాణ పఠనం, జపం, దానధర్మాలు, తర్పణం, హోమం చేయడం పుణ్యప్రదం. ముఖ్యంగా నువ్వులు, అన్నదానం, వస్త్రదానం చేయడం మంచిది. ఈ నెలలో మాఘ ఆదివారం నోము, మాఘ గౌరీ నోము చేస్తారు’ అని చెబుతున్నారు.
News January 19, 2026
పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన

AP: పోలవరం పనుల పురోగతిని విదేశీ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు ఆ బృందం పర్యటిస్తుంది. కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. ఇవాళ ప్రాజెక్టులో గ్యాప్ 1, D హిల్, G హిల్, మట్టి నిల్వల ప్రాంతాలను పరిశీలించనున్నారు. రేపు మెయిన్ డ్యామ్‌లో గ్యాప్ 2, మెటీరియల్ నిల్వలు, 21న స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్‌ను పరిశీలిస్తారు.
News January 19, 2026
శ్రీవారి మొదటి గడప దర్శనం.. టికెట్లు బుక్ చేసుకున్నారా?

తిరుమల శ్రీవారిని మొదటి ద్వారం నుంచి దర్శించుకునే భాగ్యం పొందాలని ఉందా? అయితే లక్కీడిప్ ద్వారా TTD ఈ అవకాశం కల్పిస్తోంది. ఇందులో ఎంపికైన భక్తులు స్వామిని అతి చేరువ నుంచి దర్శించుకోవడమే కాక ఆయనకు నిర్వహించే పలు సేవల్లోనూ పాల్గొనవచ్చు. ఏప్రిల్ నెలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు ఎల్లుండి చివరి గడువు. లక్కీడిప్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


