News October 25, 2024

జగన్ ఆస్తులతో షర్మిలకు సంబంధమేంటి?: వైసీపీ

image

AP: సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో విజయమ్మను ముందుపెట్టి జగన్‌ను న్యాయపరంగా ఇబ్బంది పెట్టాలని షర్మిల కుట్ర చేస్తోందని వైసీపీ ఆరోపించింది. ‘కుటుంబ ఆస్తులన్నింటినీ YSR జీవించి ఉన్నప్పుడే పంపకాలు చేసేశారు. కానీ చెల్లి షర్మిలపై ఉన్న ప్రేమాభిమానాలతో జగన్ తాను సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లోనూ వాటా ఇచ్చేందుకు ముందుకొచ్చారు’ అని ట్వీట్ చేసింది. ‘శాడిస్ట్ చంద్రబాబు’ అని పేర్కొంది.

Similar News

News October 25, 2024

రూ.100తో రూ.5 లక్షల బీమా: టీడీపీ

image

AP: ఈ నెల 26 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించేందుకు TDP ఏర్పాట్లు చేస్తోంది. రూ.100 సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాద బీమా ఇవ్వనున్నారు. అలాగే సభ్యుడి కుటుంబసభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం కూడా సాయం అందిస్తారని తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. కష్టపడ్డవారికే పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

News October 25, 2024

సంచలనం: 52కు 2 వికెట్లు.. 53కు ఆలౌట్

image

ఆస్ట్రేలియా వన్డే కప్‌లో సంచలనం నమోదైంది. టాస్మానియాపై వెస్ట్రన్ ఆస్ట్రేలియా 1 రన్ తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 52/2 ఉన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా 53కే ఆలౌటైంది. టాస్మానియా బౌలర్ బ్యూ వెబ్‌స్టర్ (5 వికెట్లు) ధాటికి ఆ జట్టు ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ జట్టులో బాన్‌క్రాఫ్ట్, ఇంగ్లిస్, టర్నర్, కనోల్లీ, కార్ట్‌రైట్, అగర్, రిచర్డ్‌సన్, మోరిస్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లుండటం విశేషం.

News October 25, 2024

హమాస్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్?

image

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కైరోలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో మొస్సాద్ చీఫ్ డేవిడ్ బోర్నియా కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈ చర్చలకు యూఎస్, ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇరుదేశాలు కాల్పులను విరమిస్తాయని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌పై యుద్ధం చేసేందుకే ఇరాన్ మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.