News October 25, 2024

విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాం: KTR

image

TG: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. సిరిసిల్లలో జరిగిన విద్యుత్ మండలి బహిరంగ విచారణలో ఆయన మాట్లాడారు. ‘అన్ని సంస్థలను ఒకే కేటగిరీగా మార్చాలన్న ప్రతిపాదన సరైనది కాదు. ఛార్జీల పెంపుతో చిన్న పరిశ్రమలపై భారం పడుతుంది. అన్ని ఇండస్ట్రీలను కాపాడుకుంటేనే మనుగడ ఉంటుంది. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఎక్కడ?’ అని ప్రశ్నించారు.

Similar News

News October 25, 2024

యశస్వీ జైస్వాల్ అరుదైన ఘనత

image

టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్న యంగెస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా జైస్వాల్ (22 ఏళ్లు) చరిత్ర సృష్టించారు. కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆయన ఈ ఫీట్ సాధించారు. గతంలో ఈ రికార్డు దిలీప్ వెంగ్‌సర్కార్ (23 ఏళ్లు, 1979) పేరిట ఉండేది. 45 ఏళ్ల తర్వాత దిలీప్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టారు.

News October 25, 2024

కాంగ్రెస్ వచ్చింది-కష్టాలు తెచ్చింది: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దద్దమ్మ పాలనలో రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతోందని మండిపడ్డారు. మూలకున్న ముసలవ్వ నుంచి బడిపిల్లల దాకా అన్ని వర్గాల వారు నిరసనలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతా కాంగ్రెస్ పాలన వద్దని నినదిస్తున్నారని ట్విటర్(X)లో రాసుకొచ్చారు.

News October 25, 2024

బడ్జెట్ రూ.45 కోట్లు.. కలెక్షన్లు రూ.50వేలు

image

భారీ అంచనాలతో రూపొందించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక భారీ నష్టాలను మిగిలిస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన చిత్రమే ‘ది లేడీ కిల్లర్‌’. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్‌ జంటగా రూ.45 కోట్ల బడ్జెట్‌తో అజయ్ బాల్ ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది నవంబర్‌లో ‘ది లేడీ కిల్లర్‌’ రిలీజవగా భారత సినీ చరిత్రలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇది కేవలం రూ.50వేలు మాత్రమే రాబట్టగలిగింది.