News October 25, 2024

ఢిల్లీ వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన.. మార్నింగ్ వాక్‌కు గుడ్‌బై!

image

ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా తాను మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేసినట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. గాలి నాణ్యత క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ సూచన మేరకు మార్నింగ్ వాక్‌కు వెళ్లట్లేదని, దీని వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 283గా నమోదైంది. కాలుష్యం పెరగడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు.

Similar News

News October 25, 2024

INTERESTING: తల నరికినా రెండేళ్లు బతికిన కోడి!

image

ఈ విచిత్రమైన ఘటన కొలరాడోలోని(US) ఫ్రూటాలో 1945లో జరిగింది. స్థానికంగా ఉండే రైతు లాయిడ్ ఒల్సేన్ తన దగ్గరున్న కోడి మెడను కట్ చేయగా అది పారిపోయింది. తర్వాత దాన్ని పట్టుకొచ్చి చూస్తే బతికే ఉంది. ఓ బాక్స్‌లో పెట్టి ఐడ్రాపర్‌ని ఉపయోగించి ఆహారం అందించాడు. కోళ్లకు తల వెనుక భాగంలో మెదడు ఉంటుంది. ఆ పార్ట్ కట్ కాకపోవడంతో కోడి బతికిపోయింది. అయితే రెండేళ్ల తర్వాత 1947లో అది మరణించింది.

News October 25, 2024

యూట్యూబ్ నుంచి అదిరిపోయే ఫీచర్

image

యూట్యూబ్ మరో సరికొత్త ఫీచర్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్ల కోసం షాపింగ్ అఫ్లియేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన వారు వీడియోలు, షార్ట్స్ ద్వారా నేరుగా మింత్రా, ఫ్లిప్‌కార్ట్ రిటైలర్ సైట్ల నుంచి అవసరమైన ఉత్పత్తులు కొనుగోలు చేసేలా అనుమతి ఇస్తుంది. ఇది కంటెంట్ క్రియేటర్లకు, వ్యూయర్లకు మధ్య కనెక్షన్‌ను బలపరుస్తోందని యూట్యూబ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

News October 25, 2024

భారీ ఆధిక్యం దిశగా కివీస్

image

పుణే వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 198 రన్స్ చేసింది. దీంతో 301 పరుగుల ఆధిక్యం సాధించింది. కెప్టెన్ లాథమ్ 86 రన్స్‌తో రాణించారు. క్రీజులో బ్లండెల్(30), ఫిలిప్స్(9) ఉన్నారు. సుందర్ 4, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 రన్స్‌కు ఆలౌటైంది.