News October 25, 2024
అవన్నీ జగన్ సొంత ఆస్తులు కాదు: షర్మిల

AP: జగన్తో ఆస్తుల గొడవలపై YS షర్మిల 3 పేజీల లేఖను విడుదల చేశారు. ‘స్వార్జితం అని జగన్ చెప్పుకుంటున్న ఆస్తులన్నీ కుటుంబానివే. ఆయన గార్డియన్ మాత్రమే. 2019లో సీఎం అయ్యాక విడిపోదామా? అని జగన్ ప్రతిపాదన పెట్టారు. సాక్షి, భారతి సిమెంట్స్లో 60% వాటా తీసుకుంటానంటే, ఒప్పుకోలేదని మాపై కేసు వేశారు. నాన్న పేరు చెడిపోతుందని మౌనంగా ఉన్నాం. కొడుకే తల్లిని కోర్టుకు ఈడ్చటం ఎంత అవమానం?’ అని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News January 25, 2026
NHAIలో 40 పోస్టులు.. అప్లై చేశారా?

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో 40 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్(సివిల్) అర్హతగల వారు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. గేట్ -2025 స్కోరు ఆధారంగా ఎంపిక చేయనున్నారు. బేసిక్ పే రూ.56,100-రూ.1,77,500గా ఉంది. వెబ్సైట్: https://nhai.gov.in/
News January 25, 2026
ఒంటి కాలిపై నిల్చోగలరా.. ప్రయోజనాలివే

ఒంటి కాలిపై నిల్చోవడాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల మరింత బలంగా అవ్వొచ్చని, జ్ఞాపకశక్తి, బ్యాలెన్స్ పెరుగుతుందని అంటున్నారు. ఒక కాలుపై నిలబడి ప్రాక్టీస్ చేసే వారికి కండరాల బలహీనత తగ్గి, పటుత్వం పెరుగుతుందని చెబుతున్నారు. 10 సెకెన్లపాటు అలా నిల్చోలేని మధ్య వయసు వారు ఏడేళ్లలో ఏదో ఒక కారణంతో మరణించే ప్రమాదం 84% ఎక్కువని ఓ స్టడీలో తేలిందని పేర్కొంటున్నారు.
News January 25, 2026
చిన్నారుల పోర్న్ వీడియోలు చూస్తున్నారంటూ..

సైబర్ నేరగాళ్లు మరో కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. ‘మీరు చిన్నారుల పోర్న్ వీడియోలు చూశారని కంప్లైంట్ వచ్చింది. మీ ఫోన్ నంబర్, IP అడ్రస్ మా వద్ద ఉంది. మేం అడిగిన డబ్బులు ఇవ్వకపోతే కేసు ఫైల్ చేస్తాం’ అని దేశవ్యాప్తంగా వేల మందికి ఈమెయిల్స్ పంపినట్లు సమాచారం. అందులోని కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, కస్టమ్స్ ఆఫీసర్ల పేర్లు, కేసు సెక్షన్లు చూసి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.


