News October 25, 2024

రూ.లక్షన్నర కోట్ల కంపెనీకి ఓనర్.. అయినా..!

image

లక్షన్నర కోట్ల సంపద ఉన్నప్పటికీ నిరాడంబరమైన జీవితాన్ని గడిపే బిలియనీర్ ఆర్ త్యాగరాజన్ గురించి తెలుసా? శ్రీరామ్ గ్రూప్‌ను స్థాపించిన త్యాగరాజన్ ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ ఏకంగా రూ.1.5లక్షల కోట్లు. దుబారా జీవితం అవసరం లేదని ఆయన చెబుతుంటారు. చిన్న ఇంట్లో జీవిస్తూ, రూ.6లక్షల విలువైన కారులో ప్రయాణిస్తుంటారు. ఆయన మొబైల్ వినియోగించేందుకు ఇష్టపడరు.

Similar News

News October 25, 2024

టీమ్ ఇండియాకు సరికొత్త ‘వాల్’ కావాలి

image

టీమ్ ఇండియాలో టాలెంటెడ్ ఆటగాళ్లకు కొదువ లేకపోయినా టెస్టుల్లో నిలదొక్కుకొని ఆడే ప్లేయర్ కొరత కొంత కాలంగా వేధిస్తోంది. ‘ది వాల్’ ద్రవిడ్ తర్వాత ఆయన స్థానాన్ని కొంత మేర పుజారా భర్తీ చేశారు. అయితే ఆయన ఫామ్ లేమితో జట్టుకు దూరమవ్వగా ఇప్పుడు ఆ ప్లేస్‌లో కొరత ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా జట్టు యాజమాన్యం ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్‌ను అన్వేషిస్తుందా లేదా వేచి చూడాలి.

News October 25, 2024

BREAKING: పోలీసు శాఖ కీలక నిర్ణయం

image

TG: రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలతో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల విధానంపై ఇటీవల ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు ఐదేళ్లు ఒకే చోట పోస్టింగ్, ఒకే రాష్ట్రం-ఒకే పోలీసింగ్ విధానం తీసుకురావాలని కానిస్టేబుళ్ల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

News October 25, 2024

ముద్ర రుణాల పరిమితి పెంపు

image

ముద్ర రుణాల పరిమితిని కేంద్రం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని చెప్పింది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు 3 రకాలుగా రూ.50వేలు, రూ.50వేలు నుంచి రూ.5లక్షలు, రూ.5-10లక్షలు లోన్స్ అందించింది. తాజాగా రూ.10-20 లక్షల రుణాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15-12.80 వడ్డీతో పొందొచ్చు.