News October 25, 2024
అనకాపల్లి: ‘పగలు రాత్రి గస్తీ నిర్వహించాలి’

దొంగతనాలు జరగకుండా పగలు రాత్రి గస్తీ నిర్వహించాలని పోలీస్ అధికారులను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కార్యాలయంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పరవాడలో జరిగిన ఏటీఎం దొంగతనం కేసులో నిందితులు వాడినట్లు అనుమానిస్తున్న వాహనం లాంటిదే కేరళ రాష్ట్రం త్రిశూల్‌లో ఇదే రకమైన కేసులో పట్టుబడిందని అన్నారు. పీటీ వారెంట్ పై నిందితులను తీసుకొస్తామన్నారు.
Similar News
News January 10, 2026
విశాఖ: 12 నుంచి జిల్లా స్థాయి పోటీలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంక్రాంతి సందర్భంగా జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పోటీలు పాండురంగపురం వద్ద సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆవిష్కరించారు. గాలిపటాలు ఎగురు వేయుట, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, తాడు లాగుట, కర్ర సాము పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News January 10, 2026
విశాఖలో ముగిసిన ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్ 3.0

విశాఖపట్నంలో జరిగిన ఇండియన్ లైట్‌హౌస్ ఫెస్టివల్ 3.0 ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ రూ.230 కోట్ల విలువైన పోర్ట్ ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా, ఏపీలో మొదటి లైట్‌హౌస్ మ్యూజియాన్ని ప్రకటించారు. గత దశాబ్దంలో లైట్‌హౌస్ టూరిజం 5 రెట్లు పెరిగిందని, దేశవ్యాప్తంగా మరిన్ని లైట్‌హౌస్‌లను పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.
News January 10, 2026
విశాఖ రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన డీఆర్ఎం

విశాఖ రైల్వే స్టేషన్లో వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోహ్ర శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు సౌలభ్యం కోసం అదనపు టికెట్ కౌంటర్లు, టికెట్ వెండింగ్ మిషన్లు, తాగునీరును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు డోర్ వద్ద నిలుచుని ప్రయాణం చేయకూడదని సూచించారు. ప్లాట్ ఫారం అవతల నుంచి రైలు ఎక్కడం వంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని ఆర్పీఎఫ్ పోలీసులను ఆదేశించారు.


