News October 25, 2024

సంచలనం: 52కు 2 వికెట్లు.. 53కు ఆలౌట్

image

ఆస్ట్రేలియా వన్డే కప్‌లో సంచలనం నమోదైంది. టాస్మానియాపై వెస్ట్రన్ ఆస్ట్రేలియా 1 రన్ తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 52/2 ఉన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా 53కే ఆలౌటైంది. టాస్మానియా బౌలర్ బ్యూ వెబ్‌స్టర్ (5 వికెట్లు) ధాటికి ఆ జట్టు ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ జట్టులో బాన్‌క్రాఫ్ట్, ఇంగ్లిస్, టర్నర్, కనోల్లీ, కార్ట్‌రైట్, అగర్, రిచర్డ్‌సన్, మోరిస్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లుండటం విశేషం.

Similar News

News October 25, 2024

ALERT: వీరికే ఉచిత సిలిండర్

image

AP: రాష్ట్రంలో ఉచిత సిలిండర్‌కు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. ఈనెల 29 నుంచి గ్యాస్ బుకింగ్ ప్రారంభం కానుండగా దీపావళి సందర్భంగా 31న తొలి ఉచిత సిలిండర్ డెలివరీ చేస్తామని తెలిపింది. కాగా ఆర్థిక సంవత్సరంలో 4 నెలలకు ఒకటి చొప్పున మొత్తం 3 సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.

News October 25, 2024

2024 US elections: ఎల‌క్టోర‌ల్ ఓట్ల గురించి (2/3)

image

50 Statesలో జ‌నాభా ఆధారంగా ఎల‌క్టోర‌ల్ ఓట్లు 435 ఉన్నాయి. ప్ర‌తి రాష్ట్రానికి 2 ఎల‌క్టోర‌ల్ ఓట్లు సెనెట్ ద్వారా వ‌స్తాయి. తద్వారా మొత్తం 535 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. వాషింగ్టన్ డీసీకి 3 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి (Winner-take-all). వీరు డిసెంబర్‌లో అధ్య‌క్షుడిని ఎన్నుకుంటారు. జ‌నవ‌రిలో కాంగ్రెస్ ధ్రువీక‌రిస్తుంది.

News October 25, 2024

2024 US elections: ఎంత బలం అవసరం?(1/3)

image

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలక్టోరల్ కాలేజ్ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ అయినప్పటికీ, నేరుగా ప్రజలు అధ్యక్షుడిని ఎన్నుకోరు. వారు తమ సొంత రాష్ట్రంలో ఎలక్టర్లకు ఓటు వేస్తారు. ఈ ఎలక్టర్లు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, అభ్యర్థికి గెలవడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. ప్రతి రాష్ట్రానికి జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ప్రజలు వీరికి ఓటేస్తారు.