News October 25, 2024

Stock Market: మళ్లీ నష్టాలు

image

ఎఫ్ఐఐల వ‌రుస అమ్మ‌కాల నేప‌థ్యంలో దేశీయ ఇన్వెస్ట‌ర్ల బై ఆన్ డిప్ స్ట్రాట‌జీ వ‌ర్కౌట్ కాక‌పోవ‌డంతో స్టాక్ మార్కెట్లు భారీ న‌ష్టాల‌ను చ‌విచూస్తున్నాయి. శుక్ర‌వారం సెన్సెక్స్ 662 పాయింట్ల నష్టంతో 79,402 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 24,180 వద్ద స్థిరపడ్డాయి. ITC 2.24%, Axis Bank 1.85%, BEL 1.55% లాభపడ్డాయి. IndusIndBK 19%, Adani Ent 5%, BPCL 5% మేర నష్టపోయాయి.

Similar News

News October 25, 2024

కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుంది: ఆది శ్రీనివాస్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అన్ని పథకాల్లో అవినీతి చేసి ఉత్తర కుమారుడిలా KTR ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. నాలుగు రోజులు ఆగితే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఎన్ని కబుర్లు చెప్పినా ఇకపై తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను విశ్వసించబోరని పేర్కొన్నారు.

News October 25, 2024

గ్రూప్-1 ఎగ్జామ్: చీరకొంగులో చీటీలు పెట్టుకొచ్చి..

image

TG: గ్రూప్-1 పరీక్షలో ఓ మహిళా అభ్యర్థి కాపీ కొడుతూ పట్టుబడింది. మహబూబ్‌నగర్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన మహిళ రంగారెడ్డి జిల్లాలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇవాళ ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్షకు హాజరైంది. ఈక్రమంలోనే చీరకొంగులో చీటీలు పెట్టుకొచ్చి, కాపీయింగ్ కొడుతుండగా ఇన్విజిలేటర్ గుర్తించారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

News October 25, 2024

ఎన్టీఆర్‌కు సభ్యత్వమైనా ఇచ్చావా బాబూ: పేర్ని

image

AP: షర్మిలను జగన్ మోసం చేశారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ‘జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎంతగానో ఉపయోగించుకున్నారు. కానీ ఆయనకు ఇప్పటికీ టీడీపీ సభ్యత్వం ఇవ్వలేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావునూ అలాగే మోసం చేశారు. హెరిటేజ్‌లో ఆయన తోబుట్టువులకు ఏమైనా వాటాలు ఇచ్చారా? జగన్ ఇంట్లో చిచ్చు పెట్టి చంద్రబాబు చలి కాచుకుంటున్నారు’ అని ఆయన మండిపడ్డారు.