News October 25, 2024
కాంగ్రెస్ వచ్చింది-కష్టాలు తెచ్చింది: కేటీఆర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దద్దమ్మ పాలనలో రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతోందని మండిపడ్డారు. మూలకున్న ముసలవ్వ నుంచి బడిపిల్లల దాకా అన్ని వర్గాల వారు నిరసనలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతా కాంగ్రెస్ పాలన వద్దని నినదిస్తున్నారని ట్విటర్(X)లో రాసుకొచ్చారు.
Similar News
News November 13, 2025
NIT వరంగల్ 45పోస్టులకు నోటిఫికేషన్

<
News November 13, 2025
విడాకుల తర్వాత భయాందోళనలకు గురయ్యా: సానియా

షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత తాను భయాందోళనలకు గురైనట్లు టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా చెప్పారు. ఆ సమయంలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తనకు అండగా నిలిచారని ఓ టాక్ షోలో తెలిపారు. కఠిన సమయంలో తన ప్రాణ స్నేహితురాలు తోడుగా ఉన్నారన్నారు. మరోవైపు సానియాను ఆ పరిస్థితుల్లో చూసి భయపడ్డానని, ఏమైనా ఆమెకు తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు ఫరా ఖాన్ పేర్కొన్నారు. మాలిక్‌తో సానియా 2023లో విడిపోయారు.
News November 13, 2025
ఆగాకర సాగు.. ఇలా నాటితే ఎక్కువ ప్రయోజనం

ఆగాకరను విత్తనం, దుంపలు, తీగ కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేస్తారు. 2-3 సంవత్సరాల వయసుగల దుంపలు నాటుటకు అనుకూలం. తీగ కత్తిరింపుల ద్వారా అయితే 2-3 నెలల వయసున్న తీగ కత్తిరింపులను ఎంచుకోవాలి. విత్తనం ద్వారా నాటుకోవాలంటే గుంతకు 4-5 విత్తనాలు నాటుకోవాలి. ఇవి పూతకు వచ్చినప్పుడు మగ మొక్కలను తీసి గుంతకు 2-3 ఆరోగ్యవంతమైన ఆడ మొక్కలను ఉంచాలి. దుంపల ద్వారా నాటడం రైతులకు శ్రేయస్కరం.


