News October 25, 2024

తిరుమల నడక దారిన వెళ్లే వారికి TTD కీలక సూచనలు

image

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, షుగర్, హై BP, గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నడక దారిన రావడం మంచిది కాదని తెలిపింది. తిరుమల కొండ చాలా ఎత్తులో ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తిరుమలలో 24 గంటలూ వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని, భక్తులు సహకరించాలని కోరింది.

Similar News

News March 18, 2025

రెండు రోజుల్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు

image

TG: రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లా బేలలో గరిష్ఠంగా 42 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 21 నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.

News March 18, 2025

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మళ్లీ మొదలు!

image

ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య కుదిరిన సీజ్‌ఫైర్ ఒప్పందం నేటితో ముగిసింది. ఇరు వర్గాలూ పొడిగించకపోవడంతో యుద్ధం మళ్లీ మొదలైంది. హమాస్ ప్రాంతాలపై ఇజ్రాయెల్ గగనతల దాడులు ప్రారంభించగా పిల్లలు సహా 34మంది మరణించారు. పాలస్తీనా శరణార్థులకు ఆశ్రయమిస్తున్న పాఠశాలపైనా అటాక్ చేసింది. అటు లెబనాన్, సిరియాల్లోని దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 10 మంది చనిపోయారు.

News March 18, 2025

లండన్ వెళ్లిన చిరంజీవి.. రేపు అవార్డు స్వీకరణ

image

కళారంగంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషికి యూకే ప్రభుత్వం రేపు ఆయనను సన్మానించనుంది. ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను మెగాస్టార్‌కు యూకే పార్లమెంట్ ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో ఆయన లండన్ చేరుకోగా అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గత ఏడాది ఆయన్ను పద్మవిభూషణ్ అవార్డు, ఏఎన్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!