News October 25, 2024
నవంబర్ 7న బీసీ కమిషన్ ఛైర్మన్ రాక: రంగారెడ్డి కలెక్టర్
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయాలను తెలుసుకునేందుకు తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం నవంబర్ 7న రంగారెడ్డి జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. ఇందులో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి నవంబర్ 7న రంగారెడ్డి కలెక్టరేట్లో కమిషన్ ఛైర్మన్ నిరంజన్ నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు.
Similar News
News November 23, 2024
TGSRTC పనితీరుపై HYDలో మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం TGSRTC పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, కొత్త బస్సుల కొనుగోలు, లాజిస్టిక్స్, ఆర్థిక పరమైన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు.
News November 23, 2024
జూబ్లీహిల్స్: శివలింగం నుదుటిపై సింధూరమైన సూర్యకిరణాలు
జూబ్లీహిల్స్ వెంకటగిరిలోని శ్రీ వీరాంజనేయ సన్నిధిలో అద్భుతం చోటు చేసుకుంది. శివునికి అభిషేకం చేస్తున్న సమయంలో సూర్యకిరణాలు శివలింగం నుదుటిపై సింధూరంలా కనిపించాయి. సూర్యకిరణాలు నేరుగా స్వామి మీద పడి.. సింధూరంలో కనిపించిందని రామంజి గురుస్వామి, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారన్నారు.
News November 23, 2024
జూబ్లీహిల్స్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సీఎస్
సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.