News October 25, 2024
US Elections: ఆ ఏడు స్వింగ్ స్టేట్స్ కీలకం

US అధ్యక్ష ఎన్నికల్లో 7 Swing States ఫలితాల్ని డిసైడ్ చేయనున్నాయి. మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్‌సిన్, ఆరిజోనా, జార్జియా, నెవాడా, నార్త్ కరోలీనా స్టేట్స్ డెమోక్రాట్లు, రిపబ్లికన్లకు కీలకం. 538 ఎలక్టోరల్ ఓట్లలో 93 ఇక్కడే ఉన్నాయి. మిగిలిన చోట్ల కమలకు 226, ట్రంప్‌నకు 219 దక్కుతాయని అంచనా. Swing Statesలోని వారు ఎవరికి మద్దతివ్వాలన్నది డిసైడ్ కాకపోవడం టెన్షన్ పెడుతోంది.
Similar News
News March 18, 2025
ఒంటి పూట బడుల సమయం మార్పు

AP: ఒంటి పూట బడుల సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడుల ప్రారంభ సమయం మధ్యాహ్నం 1.30 గంటలకు మార్చాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. టెన్త్ పరీక్ష పత్రాలు వెళ్లేంత వరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు మ.1.15 గం.కు స్కూళ్లు ప్రారంభమయ్యేవి. ఇక సా.5 గంటలకు పాఠశాలలను మూసివేయనున్నారు.
News March 18, 2025
శశాంక్ సింగ్ IPL ఆల్ టైమ్ ఎలెవన్.. కెప్టెన్ ఎవరంటే?

పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శశాంక్ సింగ్ IPLలో తన ఆల్ టైమ్ ఎలెవన్ టీమ్‌ను ప్రకటించారు. గత 17 సీజన్లలో సత్తా చాటిన ప్లేయర్లకు ఈ జట్టులో చోటు కల్పించారు. టీమ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంచుకోగా విదేశీ ప్లేయర్ల కేటగిరీలో డివిలియర్స్, మలింగను ఎంపిక చేశారు.
జట్టు: సచిన్, రోహిత్ శర్మ(C), కోహ్లీ, సురేశ్ రైనా, డివిలియర్స్, ధోనీ, హార్దిక్ పాండ్య, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ, బుమ్రా, మలింగ.
మీ టీమ్ కామెంట్?
News March 18, 2025
రన్యారావు కేసు.. తెలుగు నటుడు అరెస్ట్

కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అరెస్టు చేశారు. ‘పరిచయం’ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రన్యారావు వెనుక తరుణ్ కింగ్‌పిన్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.