News October 25, 2024
NZB: ‘ATCలలో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి’

మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతమందించే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ATC)లలో అడ్మిషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్ కుమార్ సూచించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఏటీసీ భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు.
Similar News
News January 13, 2026
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీపీ సమీక్ష

రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులతో సిపి సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోవు ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికల కోడ్ అమలు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
News January 13, 2026
NZB: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నిరుద్యోగ యువతకు ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్సీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజగంగారం తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి జూలై 19 వరకు 5 నెలల పాటు గ్రూప్-1, 2, 3, 4తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 13, 2026
NZB: బెట్టింగ్ భూతం.. తీసింది ప్రాణం

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఓ యువకుడి ప్రాణం తీసింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనెపల్లికి చెందిన పెరుమండ్ల సంజయ్(28) గత కొంతకాలంగా బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక, అదనపు డబ్బు కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. ఉన్నకాస్తా పోవడంతో మనస్తాపానికి గురైన సంజయ్.. మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికి అందిన కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదం నిండింది.


