News October 25, 2024
ఎస్సీ వర్గీకరణ వేగవంతం చేయాలి: మందకృష్ణ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. గుంటూరు అరండల్ పేటలోని ఓ హోటల్లో శుక్రవారం కృష్ణ మాదిగ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ పూర్తిఅయ్యేంత పూర్తి అయ్యేంత వరకూ ఎటువంటి డీఎస్సీ, మెగా డీఎస్సీలాంటి ఏ ఇతర నోటిఫికేషన్లు కూడా ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 23, 2024
ఉండవల్లిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎంపీల సమావేశం
ఉండవల్లి నివాసంలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఎంపీలతో చర్చించారు. అలాగే పార్టీ పాలనాపరమైన అంశాలు, కేంద్రంపై వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
News November 23, 2024
గుంటూరు జిల్లా TODAY TOP NEWS
★ గుంటూరు: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
★ మంగళగిరి: మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
★ గుంటూరు: కారంచేడు రైల్వే గేటును ఢీ కొన్న కారు
★ గుంటూరు: తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి
★ వినుకొండ: స్నానానికి వెళ్లిన స్వాములు.. ఇద్దరు మృతి
★ దాచేపల్లిలో డివైడర్‌ను ఢీకొని యువకుడు మృతి
News November 22, 2024
శాంతిభద్రతల ఏఎస్పీ రవికుమార్ బాధ్యతల స్వీకరణ
గుంటూరు జిల్లా శాంతి భద్రతల విభాగ ఏఎస్పీగా రవికుమార్ శుక్రవారం బాధ్యత స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో ప.గో జిల్లా ఏఎస్పీగా ఉన్న రవికుమార్ గుంటూరు జిల్లాకు నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మెక్కను అందించారు. జిల్లాలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు.