News October 25, 2024

ఎన్నికల ప్రచారంలో ధోనీ!

image

మిస్టర్ కూల్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ MS ధోనీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఝార్ఖండ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఓటర్లకు అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది. ఈసీ విజ్ఞప్తి మేరకు వీడియోను ఎన్నికల కమిషన్‌కు అందించారని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఓటింగ్ పర్సెంటేజ్‌ను పెంచేందుకు ఈసీ ఈ ప్రచారం చేయించనుందని సమాచారం. రాష్ట్రంలో NOV 13, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News January 3, 2025

రైలు పట్టాలపై పబ్‌జీ.. ముగ్గురు యువకుల మ‌ృతి

image

పబ్‌జీ ఆట పిచ్చి బిహార్‌లో ముగ్గురు టీనేజీ యువకుల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్‌జీ ఆడుతున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు. వారిపైనుంచి రైలు వెళ్లిపోయింది. దీంతో అందరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

News January 3, 2025

ప్రభుత్వం సంచలన నిర్ణయం?

image

TG: సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 24 రోజులుగా వారు విధులకు రాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించడం లేదా విద్యాశాఖలో విలీనం చేయడం న్యాయపరంగా కుదరదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News January 3, 2025

నేటి నుంచి నుమాయిష్

image

TG: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నేటి నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుమాయిష్‌లో 2వేల స్టాల్స్‌ను సొసైటీ ఏర్పాటు చేయనుంది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. వీకెండ్స్‌లో మరో గంట అదనపు సమయం కేటాయించారు. ప్రవేశ రుసుము రూ.50.