News October 25, 2024
నెల్లూరు జిల్లాలో 2,594 గృహాలకు రూ.6.43 కోట్లు విడుదల

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలోని 2,594 గృహాల నిర్మాణం కోసం రూ.6.43 కోట్ల నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆత్మకూరు 238, కందుకూరు 312, కావలి 460, కోవూరు 322, నెల్లూరు సిటీ 24, నెల్లూరు రూరల్ 88, సర్వేపల్లి 510, ఉదయగిరి 544, వెంకటగిరి 94 గృహాలకు బిల్డింగ్ సామాగ్రి చెల్లింపుల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. మార్చి 2025లోపు నిర్మాణాలు పూర్తి కావాలన్నారు.
Similar News
News October 29, 2025
కావలిలో భారీ వర్షపాతం నమోదు

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తెలియజేశారు. కావలి 21.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దగదర్తిలో 17.7, ఉలవపాడులో 16.2, జలదంకిలో 16.1, కందుకూరులో 15.3, కొడవలూరులో 14.6, కలిగిరిలో 13.8, లింగసముద్రంలో 13.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది.
News October 29, 2025
నెల్లూరులో Photo Of The Day

నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రాత్రి, పగలు, వర్షం అనే తేడా లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. నెల్లూరు రూరల్ కొండ్లపూడిలోని పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆ ఇద్దరూ అక్కడే భోజనం చేసి వారికి భరోసా కల్పించారు.
News October 28, 2025
నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీలు, జానియర్ కళాశాలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. విధిగా సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


