News October 25, 2024

YSR క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి: CBN

image

AP: తానెప్పుడూ రాజకీయాల్లో కక్షసాధింపునకు పాల్పడలేదని CM చంద్రబాబు అన్నారు. ‘తొలిసారి నేను రూలింగ్‌లో ఉన్నప్పుడు YSR ప్రతిపక్షంలో ఉన్నారు. అసెంబ్లీలో ఆయన రెచ్చిపోయినా నేను సంయమనం పాటించేవాడిని. ఆ తర్వాత ఆయన సీఎం అయినప్పుడు దూకుడుగా వ్యవహరించేవాడు. అయినా నేను నిలదొక్కుకొని గట్టిగా వార్నింగ్ ఇచ్చా. దీంతో ఆయన తగ్గి నాకు క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి’ అని అన్‌స్టాపబుల్‌లో తెలిపారు.

Similar News

News November 9, 2025

RITES 40పోస్టులకు నోటిఫికేషన్

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(<>RITES<<>>)40 మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.600, SC, ST, PWBDలు రూ.300 చెల్లించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

News November 9, 2025

కాంగ్రెస్, BRS నేతలను నిలదీయండి: కిషన్ రెడ్డి

image

TG: కేసీఆర్ తరహాలోనే రేవంత్ కూడా మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క అమ్మాయికీ పెళ్లి సమయంలో తులం బంగారం ఇవ్వలేదని విమర్శించారు. ‘పెన్షన్లు పెంచలేదు, కొత్తవి ఇవ్వలేదు. దళితులకు ఆర్థిక సాయం చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎటు పోయాయని కాంగ్రెస్ నేతలను నిలదీయండి. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకివ్వలేదని బీఆర్ఎస్‌ను ప్రశ్నించండి’ అని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.

News November 9, 2025

24MP ఫ్రంట్ కెమెరాతో ఐఫోన్18?

image

ఐఫోన్18 సిరీస్‌ను 2026 సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు యాపిల్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. A20 ప్రాసెసర్‌తో HIAA (హోల్ ఇన్ యాక్టివ్ ఏరియా) టెక్నాలజీని పరీక్షిస్తున్నట్లు సమాచారం. ఐఫోన్ 18, 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో డిస్‌ప్లే కింద 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చనుందని వార్తలొస్తున్నాయి. 2027లో విడుదలయ్యే 18e మోడల్‌లో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫిక్స్ చేసే చాన్స్ ఉంది.