News October 25, 2024

రోహిత్ కెప్టెన్సీపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత జట్టు ప్రదర్శన, రోహిత్ కెప్టెన్సీ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ ఫీల్డింగ్ ఏర్పాటు సరిగా చేయలేదని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. వికెట్లు తీయడమే లక్ష్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ ఉండాలని పేర్కొన్నారు. NZ బ్యాటింగ్ చూస్తుంటే రోహిత్ కెప్టెన్సీ వైఫల్యం కనిపిస్తోందన్నారు. వెంటవెంటనే వికెట్లు తీసేలా వ్యూహం రచిస్తే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయని చెప్పారు.

Similar News

News March 18, 2025

సెలబ్రిటీలపై కేసు.. పోలీసుల కీలక ఆదేశాలు

image

TG: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లను ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌, శ్యామల, కిరణ్ గౌడ్‌, సన్నీ యాదవ్‌, సుధీర్ రాజు, అజయ్‌ ఉన్నారు.

News March 18, 2025

రేపు బిల్‌ గేట్స్‌తో చంద్రబాబు భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఇంట్లో జరిగే వివాహ వేడుకకు హాజరుకానున్నారు. రేపు ఆయన మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్‌గేట్స్‌తో భేటీ కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సహకారంపై చర్చించనున్నారు. పలు ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. రేపు సాయంత్రం CBN తిరిగి అమరావతికి రానున్నారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.

News March 18, 2025

పిటిషనర్‌కు షాకిచ్చిన హైకోర్టు.. రూ.కోటి జరిమానా

image

TG: హైకోర్టును తప్పు దోవ పట్టించాలని చూసిన ఓ వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని దాచి వేరే బెంచ్‌లో ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ సీరియస్ అయ్యారు. హైకోర్టును తప్పు దోవ పట్టించేలా పిటిషన్ వేసినందుకు రూ.కోటి జరిమానా విధించారు. దీంతో అక్రమ మార్గాల్లో ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవాలన్న పిటిషనర్‌కు కోర్టు చెక్ పెట్టింది.

error: Content is protected !!