News October 25, 2024

NLG: నవంబర్ 4న బీసీ కమిషన్ బృందం రాక: జిల్లా కలెక్టర్

image

నవంబర్ 4వ తేదీన బీసీ కమిషన్ బృందం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ కమిషన్ బృందం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని కులాల (SC, ST, BC, మైనార్టీ) సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషణ చేస్తారని పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు.

Similar News

News March 11, 2026

నల్గొండ: అప్పు విషయంలో గొడవ ప్రాణం తీసింది

image

అప్పు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఆంజనేయులు, శంభు లింగం మధ్య అప్పు విషయంలో ఘర్షణ తలెత్తింది. శంభు లింగంకు తీవ్రగాయాలు కావడంతో ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంభు లింగం మరణించాడు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News March 10, 2026

నల్గొండ: పెండింగ్ పనులను పూర్తి చేయాలి : కలెక్టర్

image

జిల్లాలో ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూసేకరణలో జాప్యం లేకుండా చూడాలని, ప్రాజెక్టులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ అమిత్, ఆర్డీవోలు పాల్గొన్నారు.

News March 10, 2026

గంజాయి సేవిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి: SP శరత్ చంద్ర

image

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ స్థాయిలో రహదారి భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకొని రోడ్డు ప్రమాదాల విషయాలపై చర్చించాలని ఎస్పీ శరత్ చంద్ర పవర్ సూచించారు. నకిరేకల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించి సమాచారం తెలిస్తే తక్షణమే 8712670266 నంబర్‌కి ఫోన్ చేసి తెలియజేయాలని, గత సంవత్సరం జిల్లాలో 53 గంజాయి కేసులు నమోదు చేశామని తెలిపారు.