News October 26, 2024

‘సరస్వతి పవర్’ భూములపై పవన్ ఆరా

image

AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని ‘సరస్వతి పవర్’ భూములకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అసలు ఆ భూములకు పర్యావరణ అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆ భూముల్లో అటవీ భూమి ఎంత ఉంది, వాటిలో జల వనరులు ఏమైనా ఉన్నాయా అని ఆయన ఆరా తీశారు. సరస్వతి పవర్ భూములపై త్వరలో సమీక్షిస్తానని చెప్పారు.

Similar News

News September 14, 2025

ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు సాయం.. పాక్ వక్రబుద్ధి!

image

పాక్ మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. ఇటీవల భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు నిధులను సేకరించింది. అయితే వాటిని బాధితులకు పంచకుండా ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన లష్కరే తోయిబా(LeT) ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు మళ్లించింది. అంతకుముందు LeTకి పాక్ రూ.1.25 కోట్లు మంజూరు చేసింది. పునరుద్ధరణకు మొత్తం రూ.4.7 కోట్లు ఖర్చవుతుందని, పాక్ ఆ నిధుల సేకరణలో నిమగ్నమైందని భారత నిఘా వర్గాలు తెలిపాయి.

News September 14, 2025

కొందరు MLAలు అసెంబ్లీకి రాకున్నా జీతం తీసుకుంటున్నారు: అయ్యన్న

image

AP: కొందరు MLAలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ‘ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికే. ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్ ఆలోచించి, మార్గదర్శకాలివ్వాలి. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేది 45రోజులు.. వాటికీ రాకపోతే ఎలా’ అని ప్రశ్నించారు.

News September 14, 2025

మొటిమలకు ఇవే కారణాలు..

image

అమ్మాయిలను మొటిమలు చాలా ఇబ్బంది పెడతాయి. వాటికి ఎన్నో కారణాలుంటాయి. రాత్రిళ్లు కార్టిసాల్‌ స్థాయులు తగ్గి, కొల్లాజెన్ ఉత్పత్తై చర్మాన్ని రిపేర్‌ చేస్తుంది. మేకప్ తీయకుండా నిద్రపోతే చర్మరంధ్రాల్లో మేకప్‌ అవశేషాలు ఉండి మొటిమలొస్తాయి. పిల్లోకవర్స్ ఉతక్కపోయినా చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియా, మృతకణాల వల్ల ఈ సమస్య వస్తుంది. తలకు నూనె రాసుకొని పడుకుంటే అది సీబమ్‌ ఉత్పత్తిని పెంచుతుంది.