News October 26, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* AP: చేయని తప్పుకు శిక్ష.. గుండె తరుక్కుపోయింది: చంద్రబాబు
* షర్మిలతో పాదయాత్ర చేయించవద్దని జగన్‌కు చెప్పా: పేర్ని నాని
* ఆస్తులకు జగన్ గార్డియన్ మాత్రమే: షర్మిల
* TG: తెలంగాణ బాగు కోసమే బీఆర్ఎస్ పార్టీ: కేటీఆర్
* HYDలో కనీస మౌలిక వసతులు లేవు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
* జైలు నుంచి విడుదలైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
* రెండో టెస్టు: 301 పరుగుల ఆధిక్యంలో న్యూజిలాండ్

Similar News

News October 26, 2024

దేవాలయాల జోలికి వస్తే ఊరుకోం: మల్లాది

image

AP: హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. దేవాలయాలు జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడలో గోశాలను కూల్చివేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకం అని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తామనే వారు దీనికి సమాధానం చెప్పాలన్నారు. గతంలో పుష్కరాల సమయంలోనూ చంద్రబాబు అనేక దేవాలయాలను కూల్చివేయించారని దుయ్యబట్టారు.

News October 26, 2024

క్రీడా వర్సిటీ బిల్లుపై సీఎం రేవంత్ ఆదేశాలు

image

TG: నవంబర్ చివరి నాటికి క్రీడా వర్సిటీ బిల్లును రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పది రోజుల్లో గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు క్యాలెండర్ ఉండాలని చెప్పారు. వివిధ దేశాల క్రీడా విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

News October 26, 2024

1000కి బదులు ఆంగ్లంలో K ఎందుకు వాడతామంటే..

image

వెయ్యి అని చెప్పడానికి బదులు K అన్న అక్షరం వాడటం నేడు సర్వ సాధారణంగా మారింది. ఉదాహరణకు 5వేలకు 5K అని అంటుంటాం. ఇది గ్రీకు పదం ‘Chilioi’ నుంచి వచ్చింది. చదివేందుకు ‘చిలివోయ్‌’లా కనిపిస్తున్నా దాన్ని కిలివోయ్‌గా పిలుస్తారు. ఆ కిలివోయ్ నుంచే కిలో అన్న పదం పుట్టింది. కిలోగ్రామ్ అంటే వెయ్యి గ్రాములు, కిలోమీటర్ అంటే వెయ్యి మీటర్లు అన్నట్లుగా వెయ్యి అంకెకు ‘K’ని షార్ట్‌కట్‌లా వ్యవహరించడం మొదలైంది.