News October 26, 2024

KMR: 27 మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీ

image

కామారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాలలో పని చేస్తున్న 27 మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ఉత్తర్వులు వెలువరించారు. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. వారికి కేటాయించిన స్థానాల్లో విధుల్లోకి చేర్చుకొని సమ్మతిని నివేదించాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News January 29, 2026

NZB: ఎన్నికల ఫిర్యాదుల కోసం ఈ నంబర్‌కు కాల్ చేయండి.!

image

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణకు నియమితులైన జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి కీలక సూచన చేశారు. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు లేదా సూచనలు ఉన్నవారు 95533 95000 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. అలాగే mngdirector-tgts@telangana.gov.in మెయిల్ ఐడీ ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన కోరారు.

News January 28, 2026

నిజామాబాద్: జిల్లా కలెక్టర్‌తో ఎలక్షన్ అబ్జర్వర్ భేటీ

image

మున్సిపల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సి.హెచ్. సత్యనారాయణ రెడ్డి బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠితో భేటీ అయ్యారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్లపై కలెక్టర్ ఆయనకు వివరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు.

News January 28, 2026

NZB: విధులకు డుమ్మా.. ఆర్మూర్ హెచ్‌ఎం సస్పెన్షన్!

image

మున్సిపల్ ఎన్నికల విధులకు గైర్హాజరైన ఆర్మూర్ గర్ల్స్ హైస్కూల్ హెచ్‌ఎం వనజారెడ్డిపై వేటు పడింది. 4, 5, 6 వార్డుల రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు ఉన్నప్పటికీ, ముందస్తు అనుమతి లేకుండా ఆమె విధులకు రాలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) అశోక్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.