News October 26, 2024

క్రీడా వర్సిటీ బిల్లుపై సీఎం రేవంత్ ఆదేశాలు

image

TG: నవంబర్ చివరి నాటికి క్రీడా వర్సిటీ బిల్లును రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పది రోజుల్లో గవర్నింగ్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు క్యాలెండర్ ఉండాలని చెప్పారు. వివిధ దేశాల క్రీడా విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

Similar News

News October 26, 2024

నందిగం సురేశ్‌పై మరో కేసు

image

AP: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై మరో కేసు నమోదైంది. గతంలో అమరావతి ఉద్యమానికి మద్దతిచ్చేందుకు రైతుల శిబిరాలకు వచ్చిన ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై నందిగం సురేశ్, అతని అనుచరులు దాడి చేశారని ఓ BJP నేత ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో సురేశ్ స్వయంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే TDP ఆఫీసుపై దాడి, ఓ మహిళ హత్య కేసులు ఆయనపై నమోదయ్యాయి.

News October 26, 2024

ఇంటర్ మార్కులతో బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ

image

AP: బీఎస్సీ నర్సింగ్ కోర్సులో మిగిలిన కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఏపీఈఏపీ సెట్, నీట్ ర్యాంకులతో సంబంధం లేకుండా ఇంటర్ మార్కులతో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 మాత్రమే ఈ మినహాయింపు ఉంటుందని తెలిసింది. 2025-26 నుంచి ఇండియన్ నర్సింగ్ కౌన్సెల్ మార్గదర్శకాలు అనుసరించి NTR హెల్త్ వర్సిటీ ప్రత్యేకంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని పేర్కొన్నారు.

News October 26, 2024

జగన్ సొంత ఆస్తులే ఇవ్వాలనుకున్నారు: సజ్జల

image

AP: షర్మిలకు సొంత ఆస్తుల్లోనూ YS జగన్ వాటా ఇవ్వాలనుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గిఫ్ట్ డీడ్‌ను ఆమె దుర్వినియోగం చేసి, తల్లి పేరిట షేర్లుగా మార్చారని చెప్పారు. హైకోర్టులో స్టేటస్‌కో ఉన్నా ఆమె షేర్లు మార్చుకోవడంతోనే NCLTలో జగన్ పిటిషన్ వేశారని, ఆస్తులు వెనక్కు తీసుకోవాలనే ఆలోచన ఆయనకు లేదన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు.