News October 26, 2024

సిద్ధిఖీ హత్యకు పాకిస్థాన్ నుంచి తుపాకులు

image

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులు 4 తుపాకులు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. వాటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. డ్రోన్ సాయంతో తుపాకులను సరిహద్దులు దాటించినట్లు తెలిపారు. కాగా అక్టోబర్ 12న ముంబైలో సిద్ధిఖీని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందం హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ కేసులో 14 మంది అరెస్ట్ కాగా ముగ్గురు పరారీలో ఉన్నారు.

Similar News

News October 26, 2024

Silver Shining: బంగారం కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన వెండి

image

ఈసారి బంగారం మెరుపుల్ని వెండి డామినేట్ చేసింది! ఈ ఏడాది ఇప్పటి వరకు 30% రిటర్న్ ఇచ్చింది. ఇక పుత్తడి 23%, నిఫ్టీ 15% రాబడి అందించాయి. గత OCTలో కేజీ సిల్వర్ రూ.73వేలు ఉండగా ఇప్పుడు రూ.లక్షా పదివేలకు చేరుకుంది. ఈ మెటల్‌ను నగలు, పాత్రలకే కాకుండా ఇండస్ట్రీస్‌లోనూ వాడతారు. ధరలు ఎక్కువ ఆటుపోట్లకు లోనవుతాయి కాబట్టి పోర్టుఫోలియోలో వెండి కన్నా బంగారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

News October 26, 2024

బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా DSC కోచింగ్: మంత్రి

image

AP: డీఎస్సీ అభ్యర్థుల కోసం 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. అన్ని ప్రవేశ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. కేంద్ర పథకాలను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బీసీ హాస్టళ్లలో డైట్ బిల్లు బకాయిలను త్వరలో చెల్లిస్తామన్నారు. సీడ్ పథకంతో సంచార జాతులకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు.

News October 26, 2024

టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీల విడుదల

image

AP: టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజులను ఈ నెల 28 నుంచి నవంబర్ 11లోపు చెల్లించాలని ప్రభుత్వం పరీక్షల విభాగం ప్రకటించింది. రెగ్యులర్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయుల ద్వారా రూ.125 ఫీజు చెల్లించాలని తెలిపింది. నవంబర్ 12 నుంచి 18లోపు చెల్లిస్తే రూ.50, 19 నుంచి 25 వరకు రూ.200, 26 నుంచి నెలాఖరు వరకు అయితే అదనంగా రూ.500 ఫైన్‌తో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.