News October 26, 2024

చిత్తూరు: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఉరి వేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు 2 టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. తేనె బండ ధర్మరాజుల కాలనికి చెందిన మురళి (29) చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. యజమాని వద్ద డబ్బులు తీసుకుని తిరిగి కట్టలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం ఉరివేసుకున్నాడు. మృతదేహాన్ని మార్చురికి తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Similar News

News January 13, 2026

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలో ఎక్కడ జల్లికట్టు, కోడిపందాలు, పేకాట నిర్వహించకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం ఆదేశించారు. ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటే 112 కు లేదా 9440900005 ఫోన్ లేదా మెసేజ్ చేయాలని సూచించారు. తమ సిబ్బంది వెంటనే చేరుకొని చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

News January 13, 2026

చిత్తూరు: కరెంట్ వైర్లతో జాగ్రత్త..!

image

సంక్రాంతి సందర్భంగా కరెంట్ వైర్లకు దూరంగా గాలిపటాలు ఎగురవేయాలని చిత్తూరు ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ సూచించారు. గాలిపటాలు కరెంటు వైర్ల మధ్య చిక్కుకున్నప్పుడు వాటిని తీయకూడదని స్పష్టం చేశారు. ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లకు దూరంగా ఎగురవేయాలని, లోహపు దారాలతో పతంగులు ఎగరవేయరాదని కోరారు. ప్రమాదాలు జరిగితే టోల్ ఫ్రీ 1912కు ఫోన్ చేయాలన్నారు.

News January 13, 2026

చిత్తూరు జిల్లాలో వ్యవసాయానికి ముప్పు.!

image

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలమట్టం తీవ్రంగా పడిపోతున్నట్లు CGWB నివేదిక సోమవారం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం 20 మీటర్ల కంటే లోతుకు చేరింది. అదేవిధంగా సోడియం కార్బొనేట్ (RSC) అవశేషాలు అధికంగా ఉండటంతో వ్యవసాయ భూముల సారం సైతం తగ్గుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో జిల్లాలో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని సూచించారు. దీంతో వ్యవసాయానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు.