News October 26, 2024
ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ సజీవదహనం

పెళ్లకూరు మండలం నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలోని టెంకాయ తోపు గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో కంటైనర్ లారీ డ్రైవర్ ఫిరోజ్ మంటల్లో సజీవ దహనం అయ్యాడు. కంటైనర్ లారీ ముందు భాగం కాలిపోయింది.
Similar News
News November 6, 2025
నెల్లూరు జిల్లా విభజన ఇలా..!

మరోసారి నెల్లూరు జిల్లా విభజన జరగనుంది. కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. తిరుపతి జిల్లాలోని గూడూరు నెల్లూరులోకి రానుంది. విడవలూరు, కొడవలూరును కావలి నుంచి నెల్లూరు డివిజన్‌లోకి మార్చనున్నారు. కలువాయి, రాపూరు, సైదాపురం గూడూరు డివిజన్‌లోకి, వరికుంటపాడు, కొండాపురం జలదంకి, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం, ఉదయగిరిని కావలి డివిజన్‌లోకి మార్చేలా ప్రతిపాదనలు చేశారు.
News November 5, 2025
నెల్లూరు: రేపే నారా లోకేశ్ రాక

నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ పర్యటన ఖారారైంది. ఆయన గురువారం దగదర్తికి రానున్నారు. దివంగత ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. సంబంధిత ఏర్పాట్లను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కావలి డీఎస్పీ శ్రీధర్ బుధవారం పరిశీలించారు.
News November 5, 2025
NLR: జనసేనలో విబేధాలపై రహస్య విచారణ

నెల్లూరు జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాకు MSME ఛైర్మన్ శివ శంకర్ వచ్చారు. రెండు రోజుల పాటు నేతలతో విడివిడిగా మాట్లాడారు. నివేదికను జనసేనానికి అందివ్వనున్నారు. జనసేనాని జోక్యంతో నేతల్లో ఉన్న అసంతృప్తి జ్వాల చల్లారుతుందో లేదో చూడాలి.


